Beauty Tips

Hair Care Tips:ఈ పేస్ట్ తలకి రాసి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది

Alovera and coffee hair mask :ఈ పేస్ట్ తలకి రాసి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది.. ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా వస్తుంది. తీసుకునే ఆహారం, వాతావరణంలో కలిగే మార్పులు వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల నూనెలను., షాంపూలను వాడేస్తూ ఉంటారు.

దీని కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్య, చుండ్రు వంటి జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ రెమిడీ చేయటం చాలా సులువు. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఒక బౌల్ లో మూడు స్పూన్ల కలబంద జెల్, మూడు స్పూన్ల అల్లం రసం, ఒక స్పూన్ కాఫీ పొడి,రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి అన్నీ ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అలా వదిలేయలి. ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరగటమే కాకుండా మృదువుగా మెరుస్తూ ఉంటుంది. అల్లం జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. హెయిర్ రూట్, ఫోలికల్స్‌ను దృఢంగా మారుస్తుంది. అల్లంలో ఉండే అనేక ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ఖనిజాలు వెంట్రుకలను బలంగా మారుస్తూ జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి.

కలబంద జుట్టును మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా కలబందలో ఉండే అనేక విటమిన్లు, మినరల్స్, ఎంజైములు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పొడవుగా ,దృఢంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయ్యి జుట్టుకి సంబందించిన సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."