Dandruff:ఇలా చేస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి 3 రేట్లు వేగంగా జుట్టు పెరుగుతుంది
Dandruff home remedies In Telugu : వాతావరణంలో వచ్చే మార్పులు, తరచుగా వానలో తడవడం, తడి జుట్టును జడగా వేసుకోవటం, తల స్నానం సరిగా చేయకపోవడం వంటి అనేక రకాల కారణాలతో చుండ్రు సమస్య చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చుండ్రు సమస్య ఉందంటే జుట్టు రాలే సమస్య కూడా వచ్చేస్తుంది. కాబట్టి చుండ్రు సమస్య ప్రారంభం కాగానే మనం ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. .

అయితే మనలో చాలామంది చుండ్రు సమస్య రాగానే మార్కెట్లో దొరికే షాంపూలు, నూనెలను వాడుతూ ఉంటారు. వాటి వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించి చుండ్రు సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది.

ఒక ఉల్లిపాయ తీసుకుని పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అంగుళం అల్లం ముక్కని తీసుకుని పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, రెండు రెబ్బల కరివేపాకు వేసి కొంచెం నీటిని పోసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. .

ఈ పేస్ట్ నుంచి పలుచని వస్త్రం సాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి. ఈ జ్యూస్ ను బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో అర స్పూన్ మిరియాల పొడి, రెండు స్పూన్ల అలోవెరా జెల్ వేసి అన్ని బాగా కలిసేలాగా కలిపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పావుగంట అలా వదిలేసి ఆ తర్వాత జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించాలి.

ఒక గంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే చుండ్రు సమస్య చాలా తొందరగా తొలగిపోతుంది. వారంలో ఒకసారి చేస్తే సరిపోతుంది. అలాగే జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది. దాంతో జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


