ఈ నూనెను వారంలో 2 సార్లు రాస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది
Hair Fall Oil In Telugu : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చుండ్రు, జుట్టు రాలే సమస్యతో చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. ఈ సమస్యలు రాగానే మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వలన తాత్కాలికంగా ఉపశమనం కలిగిన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. .

ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటిలో మనం సహజసిద్ధంగా ఒక నూనె తయారు చేసుకుని వాడితే మంచి ఫలితం కనబడుతుంది. ఒకసారి చేసుకుంటే ఈ నూనెను నెలరోజుల పాటు వాడవచ్చు. ఒక గ్లాస్ జార్లో ఒక స్పూన్ డ్రై రోజు పెటల్స్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూను మెంతిపొడి వేసుకోవాలి. .

ఆ తర్వాత ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక స్పూన్ kalonji seeds, ఆరు మందార పువ్వు రేకలు, చిన్న ముక్క వట్టివేరు, ఒక కప్పు కొబ్బరి నూనె, అర కప్పు బాదం నూనె వేసి అన్ని బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఐదు రోజులపాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత పల్చని వస్త్రం సాయంతో ఈ నూనెను ఫిల్టర్ చేసి ఒక బాటిల్ లో పోసుకోవాలి.

ఈ నూనె రాత్రి పడుకోవటానికి ముందు తలకు బాగా పట్టించి ఐదు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి షవర్ కాప్ పెట్టుకొని మరుసటి రోజు ఉదయం కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య వంటి అన్ని రకాల జుట్టుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

జుట్టు కుదుళ్ళకు మంచి పోషణ అంది జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు నల్లగా .నిగనిగలాడుతూ కాంతివంతంగా మెరుస్తుంది. కాబట్టి ఈ నూనెను తయారు చేసుకుని జుట్టుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడండి. కాస్త ఓపికగా ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనం పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

