MoviesTollywood news in telugu

Allu Arjun ‘ఆర్య’ సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…?

Tollywood Hero Allu Arjun Arya movie in Telugu : అల్లు అరవింద్ వారసుడిగా టాలివుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అల్లువారబ్బాయి అల్లు arjun గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన తొలిమూవీ, బన్నీకి సెకండ్ మూవీ ఆర్య. అద్భుతమైన కథ, కథనంతో తెరకెక్కిన ఈ మూవీ 2004మే 7న రిలీజయింది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీని యూత్ కి కిక్కేలా తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ నటన చూస్తే, ఇది రెండవ సినిమానా అనే అనుమానం రావడం సహజం. అనురాధ మెహతా హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు బలాన్నిచ్చింది. 56సెంటర్స్ లో 100డేస్ ఆడిన ఈ మూవీ 30కోట్ల షేర్ రాబట్టింది.

నాలుగు నంది అవార్డులను, 5 సంతోషం ఫిలిం ఫేర్ అవార్డులను, 4సినిమా అవార్డులను, బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్ ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్న ఆర్య మూవీకి 2వారాల గ్యాప్ తో పోటీగా వచ్చిన సినిమాలు పరిశీలిద్దాం. ఏప్రియల్ 23న రియల్ స్టార్ శ్రీహరి హీరోగా శేషాద్రి నాయుడు వచ్చింది. సిస్టర్ సెంటిమెంట్ గల ఈ మూవీ ని సురేష్ వర్మ తెరకెక్కించగా ఏవరేజ్ అయింది.

ఏప్రియల్ 28న ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం ఒద్దు మూవీ రిలీజయింది. రాజేంద్ర ప్రసాద్, రాశి జంటగా నటించిన ఈ మూవీ నిరాశ పరిచింది. కొంగరపి వెంకట రమణ డైరెక్ట్ చేసాడు. జగపతి హీరోగా నటించిన పెదబాబు మూవీ ఏప్రియల్ 30న వచ్చింది. కళ్యాణి హీరోయిన్ గా చేసిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఇదేరోజు శివబాలాజీ ప్రధాన పాత్రలో దోస్త్ మూవీ వచ్చి, పరాజయం పాలైంది.

ముప్పలనేని శివ డైరెక్ట్ చేసాడు. మహేష్ బాబు నటించిన ఎస్ జె సూర్య డైరెక్షన్ లో వచ్చిన నాని మూవీ ఆకట్టుకోలేక పోయింది. మణిరత్నం డైరెక్షన్ లో సూర్య, మాధవ, సిద్ధార్ధ నటించిన యువ మూవీ మే 21న రిలీజయింది. మూవీ పర్వాలేదనిపించింది. ఇక ఇదేరోజు ప్రభాస్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన అడవి రాముడు మూవీ ఏవరేజ్ అయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."