Hair Fall : జుట్టు రాలే సమస్య మీకుందా.. ఇలా చేస్తే రాలిన జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది…
rice and tea powder Home Remedies in telugu : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి జుట్టు రాలే సమస్య Hair Fall సర్వసాధారణమైంది. చిన్నవారి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరినీ ఈ సమస్య వెంటాడుతుంది. అయితే ఈ Hair Fall సమస్య ఆత్మవిశ్వాస నీ ప్రభావితం చేయడంతో పాటుగా మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది.
జుట్టుకు సంబంధించిన సమస్యలు హెయిర్ ఫాల్, చుండ్రు, తెల్ల జుట్టు వంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు స్త్రీలనే కాకుండా పురుషులను కూడా వేధిస్తున్నాయి. ఈ సమస్యలు రాగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే ఖరీదైన షాంపూలు, హెయిర్ ఆయిల్ వాడుతూ ఉంటారు.
అయినా పెద్దగా ఫలితం కనబడక చాలా నిరాశకు గురి అవుతూ ఉంటారు. అలాకాకుండా ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాను ఫాలో అయితే చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో జుట్టు రాలే సమస్యను, తెల్లజుట్టు,చుండ్రును సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను చాలా సులభంగా చేసుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీరు కాస్త వేడయ్యాక రెండు స్పూన్ల టీ పొడి వేసి బాగా మరిగించి డికాషన్ వడగట్టాలి. రెండు స్పూన్ల బియ్యాన్ని కడిగి నీటిని పోసి నానబెట్టాలి. ఆ తర్వాత ఒక కలబంద ఆకును శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు, నాలుగు మందార పువ్వులు వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీ చేయాలి.
ఆ తర్వాత ఆ మిశ్రమంను ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో నాలుగు టీ స్పూన్ల టి డికాషన్, 4 స్పూన్ల బియ్యం నీరు, అర స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది.
అలాగే తెల్ల జుట్టు కూడా తొందరగా వచ్చే అవకాశాలు తగ్గుతాయి. చుండ్రు సమస్య, తలలో దురద వంటివి కూడా తొలగిపోతాయి. చుండ్రు సమస్య ఉందంటే జుట్టు రాలే సమస్య కూడా చాలా ఎక్కువ అవుతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

