MoviesTollywood news in telugu

Venkatesh బొబ్బిలి రాజా సినిమా గురించి ఈ నిజాలు మీకు తెలుసా?

victory Venkatesh Bobbili raja Movie : రామానాయుడు కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన venkatesh చాలా తొందరగానే తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో కలియుగ పాండవులు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాడు.

అయితే బిగ్గెస్ట్ హిట్ అందుకోడానికి మాత్రం ఏకంగా నాలుగేళ్లు పట్టింది. 16సినిమాల తర్వాత 1990లో విడుదలైన బొబ్బిలి రాజా వెంకటేష్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. చిరంజీవికి ఖైదీ, నాగార్జునకు శివ మూవీ ఎలాగో వెంకటేష్ కి బొబ్బిలి రాజా స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాతోనే విక్టరీగా మారాడు. సురేష్ బాబు నిర్మాతగా మారి,వెంకటేష్ ని మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేయడానికి పరుచూరి బ్రదర్స్ కి ఓ కథ సిద్ధం చేయమని అడిగారు.

వారం రోజుల్లో కథ రెడీ అయింది. బి గోపాల్ డైరెక్షన్ లో ఈ సినిమా చేయాలనీ నిర్ణయించారు. హీరోయిన్ గా దివ్య భారతిని తీసుకోవడంతో ఆమెకు తెలుగులో ఇదే మొదటి సినిమా అయింది. ఆమె వయస్సు అప్పటికి 16ఏళ్ళు. సురేష్ పూర్తిస్థాయి నిర్మాతగా మారి స్టార్ట్ చేసిన బొబ్బిలిరాజా 1990సెప్టెంబర్ 14న ఆడియన్స్ ముందుకి వచ్చింది.

విడుదల రోజునే సెన్షేషనల్ హిట్ అందుకున్న బొబ్బిలి రాజా లోని ఫారెస్ట్ సీన్స్, ఫైట్స్ మాస్ కి విపరీతంగా నచ్చాయి. ఇక సాంగ్స్ జనం నోళ్ళలో నానాయి. ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపించేవి. బలపం పట్టి , కన్యాకుమారి వంటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి. వెంకటేష్ లో మాస్ యాక్షన్ కి తోడుగా, దివ్యభారతి గ్లామర్ అదరగొట్టేసింది.

ఇక దీనికన్నా ఏడాది ముందు వచ్చిన శివ,నాలుగు నెలల ముందు విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీస్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించాయి. అయితే ఇవి మరిచిపోకముందే అదే రేంజ్ లో బొబ్బిలి రాజా సంచలన విజయం నమోదుచేసుకుంది. 38కేంద్రాల్లో 100రోజులు ఆడి, ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. 3కేంద్రాల్లో 175రోజులు ఆడడంతో సరికొత్త రికార్డ్ వెంకీ క్రియేట్ చేసాడు.

హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో 210రోజులు నడిచిన ఈ సినిమా సింగిల్ థియేటర్ అత్యధిక గ్రాస్ మూవీగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇండస్ట్రియల్ హిట్ గా సురేష్ బాబు పేపర్ స్టేట్ మెంట్ ఇవ్వడంతో వివాదం వచ్చింది. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీని బొబ్బిలి రాజా క్రాస్ చేయలేదని ఇతర ఫాన్స్ చెప్పేమాట. ఇక బొబ్బిలిరాజా తమిళ ,హిందీ భాషల్లో డబ్ అయింది.