MoviesTollywood news in telugu

Ravi teja: క్రాక్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Ravi Teja Krack Movie: ఒక హీరో సినిమాను మిస్ చేసుకుంటే.. మరొక హీరో ఆ సినిమాను చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని కాంబినేషన్స్ హిట్ ఫెయిర్ గా నిలుస్తాయి. అలాగే మాస్ మహారాజ్ రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు గా నిలిచాయి.

ఇక తాజాగా వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా క్రాక్ ఈ సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా కథను గోపీచంద్ మలినేని మొదట వెంకటేష్ కు వినిపిస్తే, ఎందుకో ఆసక్తి చూపించలేదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇక అప్పటికే ప్లాప్ లతో సతమతమవుతున్న రవితేజకు గోపీచంద్ మలినేని కథ వినిపించడంతో ఒకే చెప్పేయడం సినిమా పట్టాలెక్కడం చకచకా నడిచింది.

రవితేజ అభిమానులు సైతం ఈ కథ రవితేజకే బాగా సూట్ అవుతుందని అనుకున్నారు. సరిగ్గా అదే జరిగింది. నిజానికి 2017 సంవత్సరంలో రవితేజ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కి విడుదలైన రాజా ది గ్రేట్ సినిమా తరువాత రవితేజ హీరోగా నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు.

టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా ఇలా వరుసగా 4 ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సమయంలో క్రాక్ సినిమాతో మళ్లీ రవితేజ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసాడు. హీరోయిన్ గా చేసిన శృతిహాసన్ కు కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."