Devotional

Sankranti రోజు రాగి నాణెంతో ఇలా చేస్తే ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి

Makara Sankranti 2023 :సంక్రాంతి పండుగను నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరంలో ఎన్నో ఆశలను పెట్టుకుంటారు. కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగను ధనిక,పేద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కుటుంబంతో చాలా ఆనందంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ నాలుగు రోజులు ఇల్లంతా కూతుళ్లు,అల్లుళ్ళు,మనవలతో కళకళ లాడుతూ ఉంటుంది.

ఇంటిలో కానీ వ్యాపారంలో కానీ ఏమైనా సమస్యలు ఉంటే సంక్రాంతి రోజు ఈ చిన్న పని చేస్తే ఆ సమస్యలు వెంటనే తొలగిపోతాయి. ఈ సమస్య పరిష్కారానికి ఒక రాగి నాణెము అవసరం అవుతుంది. అయితే రాగి నాణెంతో ఏమి చేయాలో వివరంగా తెలుసుకుందాం.

సంక్రాంతి రోజున ఉదయం తలస్నానము చేసి దేవుణ్ణి ప్రార్ధించి ఒక రాగి నాణెం తీసుకోని మీ ఇంట్లో గానీ , వ్యాపారంలో గానీ డబ్బులు పెట్టె ప్రదేశంలో ఆ రాగి నాణెంతో మూడు సార్లు దిష్టి తీసి ఆ నాణేన్ని ఎర్రటి వస్త్రంలో పెట్టి మూట కట్టాలి. ఈ మూటను దేవుడి దగ్గర పెట్టి ధూప దీప నైవేద్యాలు సమర్పించి సమస్యలు లేకుండా చూడమని ప్రార్ధన చేయాలి. సాయంత్రం సమయంలో ఆ మూటను నదిలో లేదా పారే నీటిలో నిమ్మజ్జనం చేయాలి. సంక్రాంతి రోజు ఇలా చేస్తే ఆర్థికపరమైన సమస్యలు,కష్టాలు అన్ని తొలగిపోతాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."