MoviesTollywood news in telugu

బాలయ్య, చిరంజీవితో గౌతమి ఎందుకు నటించలేదంటే…కారణం ఇదే

Tollywood heroine gawthami : టాలీవుడ్ లో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ విషయాలు తెలుసుకుంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ వింతగానే ఉంటుంది. కొన్ని కాంబినేషన్స్ అనుకోకుండా సెట్ అవుతాయి. కొన్ని అనుకున్నా సెట్ కావు. కొన్ని కాంబినేషన్స్ ప్రయత్నించినా ఎందుకో వర్కవుట్ కావు. ఇక ఇండస్ట్రీలో నిలబడాలంటే,గ్లామర్,అభినయంతో పాటు అదృష్టం కూడా కంపల్సరీగా ఉండాల్సిందే.

కొందరు స్టార్ హీరోయిన్స్ నటన ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకుంటూ యాక్ట్ చేసుకుంటూ పొతే,ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉండదు. ఇక తెలుగు నటి అయినప్పటికీ తమిళంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన గౌతమి పలు తెలుగు సినిమాలలో కూడా నటించి మెప్పించింది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ కమల్ హాసన్ తో గౌతమీ కొన్నేళ్లు సహజీవనం కూడా చేసింది.

అయితే మెగాస్టార్ చిరంజీవితో మాత్రం ఈమె కల్సి నటించలేకపోయింది. చిరంజీవితో సినిమాలో చేద్దామని అనుకున్నప్పుడల్లా రజినీ కాంత్ సినిమా డేట్లతో ఇబ్బంది అయ్యేదని అందుకే చిరంజీవితో నటించే ఛాన్స్ రాలేదని తాజాగా ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చింది. అలాగే బాలకృష్ణతో కూడా కలిసి నటించలేక పోయానని గౌతమీ చెప్పుకొచ్చింది. ఇటీవల తమిళనాట జరిగిన ఎన్నికల్లో బిజెపి తరపున ప్రచారం చేసిన ఈమె కమల్ కి వ్యతిరేకంగా ప్రచారం సాగించడం విశేషం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."