యాంకర్ సుమ ప్రభాస్ కి సిస్టర్ గా నటించింది…ఏ సినిమా మీకు తెలుసా…?
Anchor Suma :యాంకర్ సుమ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు తెలియని టీవీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. సుమ కేరళకు చెందిన అమ్మాయి అయినా తెలుగు చాలా స్పష్టంగా అవలీలగా పంచ్ లు వేస్తూ మాట్లాడేస్తుంది. సుమను చూసినవారు తెలుగు అమ్మాయి అని అనుకుంటారు. ఎంత పెద్ద షో అయినా… ఎంత పెద్ద సినిమా ఈవెంట్ అయినా అవలీలగా సరదాగా మాట్లాడేస్తూ రక్తి కట్టిస్తుంది.
స్టార్ హీరో సినిమా ఫంక్షన్లకు కచ్చితంగా సుమ యాంకర్ గా ఉండాల్సిందే . సుమ యాంకర్ గా ఉంటే సినిమా హిట్ అవుతుందని నమ్మకం కూడా ఉంది. అందుకే స్టార్ హీరోలు అందరూ సుమ కావాలని కోరుకుంటారు. ఆ మధ్య పొన్నియన్ సెల్వన్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమ హోస్ట్ గా వ్యవహరించారు.
ఆ సందర్భంగా త్రిష మాట్లాడుతూ సుమ గారు వర్షం సినిమా నుంచి పరిచయం ఉందని…ఆ సినిమాలో సుమ గారు ప్రభాస్ చెల్లిగా నటించిందని..సుమ గారిని కలవటం ఆనందంగా ఉందని చెప్పింది.
Click Here To Follow Chaipakodi On Google News

