సినిమాల కోసం నాన్ వెజ్ మానేసిన నటులు.. లిస్ట్ లో మీ అభిమాన Actor…?
Tollywood heroes:టాలీవుడ్ లో హీరోలకు, హీరోయిన్లకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తమ అభిమాన నటుల గురించి ఏ చిన్న విషయం తెలిసిన తెలుసుకోవటానికి చాలా ఆసక్తిగా ఉంటారు. సినిమాల కోసం మన హీరోలు, హీరోయిన్లు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. పాత్ర కోసం ఏమి చేయటానికి అయినా సిద్ధంగా ఉంటారు. కొంతమంది నటులు తమకు ఎంతో ఇష్టమైన ఆహారాన్ని కూడా వదులుకుంటూ ఉంటారు. ఇప్పుడు సినిమాల కోసం నాన్ వెజ్ మానేసిన నటుల గురించి తెలుసుకుందాం.
శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అంటే ముందుగా మనకు ఎన్టీఆర్ రూపమే గుర్తుకొస్తుంది, ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో పౌరాణిక సినిమాల్లో నటించారు. పౌరాణిక సినిమాల్లో నటించే సమయంలో ఎన్టీఆర్ నాన్ వెజ్ కు దూరంగా ఉండేవారు.
హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం మై గాడ్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కృష్ణుడి పాత్రలో నటిస్తున్నారు. దాంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు నాన్ వెజ్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
పరిణితి చోప్రా ‘కోడ్ నేమ్ తిరంగ’ అనే సినిమా సమయంలో నాన్ వెజ్ కి దూరంగా ఉన్నారు.
కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘వినోదయ సీతమ్’ కు రీమేక్ గా వస్తున్న “బ్రో” సినిమాలో పవన్ కాల దేవుడిగా కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు నాన్ వెజ్ ముట్టుకోనని పవన్ నిర్ణయం తీసుకున్నారు.
దువ్వాడ జగన్నాధం సినిమాలో నటించిన సమయంలో అల్లు అర్జున్ నాన్ వెజ్ కి దూరంగా ఉన్నారని సమాచారం. బ్రాహ్మణులను గౌరవిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట.
అక్కినేని నాగార్జున సాయిబాబా గా నటించిన “శిరిడి సాయి” సినిమా షూటింగ్ పూర్తీ అయ్యేవరకు నాగార్జున నాన్ వెజ్ కి దూరంగా ఉన్నారట.

