MoviesTollywood news in telugu

BRO Twitter Review : పవన్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్.. ఫస్టాఫ్ బాగుంది కానీ..!

BRO Twitter Review : పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్ కాంబినేషన్ లో మొదటి సారిగా వస్తున్న BRO సినిమా ఈ రోజు అభిమానుల ముందుకు వచ్చింది. వినోదయ సీతమ్ అనే తమిళ సినిమాను తెలుగులో బ్రో.. ది అవతార్ అనే పేరుతో రీమేక్‌‌‌ గా చేసారు. ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. బ్రో ట్రైలర్‌ ( Bro.. The Avatar Trailer) సినిమాపై అంచనాలను బాగా పెంచేసింది.

పవర్ స్టార్ పాత సినిమాల్లోని చాలా రిఫరెన్స్‌లు సినిమా మొత్తం చూపించారట. అలాగే, పొలిటికల్ సెటైర్లు కూడా గట్టిగానే వేశారని అంటున్నారు. అయితే ఫస్టాఫ్ ఉన్నంతగా సెకండాఫ్ లేదని టాక్. మొత్తంగా ఇప్పటివరకు వచ్చిన టాక్ ప్రకారం మిశ్రమ స్పందన కనిపిస్తుంది. పవన్ అభిమానులకు నచ్చే విధంగా ఫస్టాఫ్‌లో బాగా చూపించారట. ఒక రకంగా చెప్పాలంటే పవర్ అభిమానులకు ఫుల్ మీల్స్ అంటున్నారు.

కామెడీ, పవన్ కళ్యాణ్ మేనరిజంతో ఫస్టాఫ్ అంతా బోర్ కొట్టకుండా సాగుతుందట. ఎక్కువగా పవన్ కళ్యాణ్ మేనరిజం, పాత సినిమాలలో గెటప్ లు వంటివి అభిమానులను ఆకట్టుకుంటాయి. మొత్తంగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే.. సందర్భానుసారంగా వచ్చే పవన్ కళ్యాణ్ వింటేజ్ సాంగ్స్, పర్‌ఫెక్ట్‌గా ఫిట్ అయ్యే పొలిటికల్ డైలాగులు. పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ కూడా అదుర్స్ అట.

ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే.. మంచి స్టోరీలైన్‌ను తెరపై అంతే గొప్పగా చూపించటంలో విఫలం అయ్యారట. కేవలం పవన్ అభిమానుల మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. క్లోజప్ షాట్స్ ఎక్కువగా ఉండటం కొంత ప్రేక్షకులను విసిగిస్తుందట. మొత్తంగా చూసుకుంటే పవన్ అభిమానులకు బాగా నచ్చుతుంది. సాయి ధరం తేజ్ నటనలో ఇంకా పరిణితి ఉండాలని టాక్ వస్తుంది.