Beauty Tips

Remedies for White Hair: తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు.. మీ కోసమే..

Remedies for White Hair: తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు.. మీ కోసమే.. ప్రస్తుత కాలంలో చాలా మంది తెల్ల జుట్టుతో బాధ పడుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడంతో బయట నలుగురిలో తిరగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది.

ముఖ్యంగా యువతలో తెల్ల జుట్టు ఎక్కువగా కనిపిస్తుంది. అకాలంగా తెల్ల జుట్టు వచ్చిందంటే అనారోగ్యానికి సంకేతంగా చెప్పొచ్చు. సరైన పోషణ లేని కారణంగా జుట్టు రంగు అనేది మారుతుంది. ఈ తెల్ల జుట్టును తగ్గించుకోవడానికి చాలా మంది మార్కెట్లో లభించే అనేక ప్రాడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటితో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అలా కాకుండా ఇంట్లోనే కొన్ని నేచురల్ పద్దతుల ద్వారా కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

బ్లాక్ టీ
బ్లాక్ టీ తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక కప్పు నీటిని పోసి బాగా మరిగించాలి. దానిలో రెండు టీ స్పూన్ల బ్లాక్ టీ ఆకులు వేసి రెండు నిమిషాలు మరిగించి ఈ మిశ్రమం చల్లారాక జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అలా వదిలేయాలి.

ఆ తర్వాత చల్లని నీటితో తల స్నానం చేయాలి. మరుసటి రోజు ఉదయం హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే బ్లాక్ టీ లో ఉన్న పోషకాలు జుట్టుకి నలుపు రంగును ఇస్తుంది. అలాగే నిర్జీవంగా మారిన జుట్టులో జీవాన్ని నింపుతుంది.

నిమ్మకాయ, కొబ్బరి నూనె తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో చాలా బాగా సహాయపడతాయి. నాలుగు స్పూన్ల కొబ్బరి నూనెలో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట తర్వాత హెర్బల్ షాంపుతో తలుస్తానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా కొత్త తెల్ల జుట్టు రావడం కూడా తగ్గుతుంది.

కరివేపాకు తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా జుట్టు కుడుళ్ళను బలంగా మార్చి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది. అరకప్పు కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకును వేసి కరివేపాకు నలుపు రంగు వచ్చేవరకు మరిగించాలి.

ఈ మిశ్రమం చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట తర్వాత హెర్బల్ షాంపుతో తలస్నానం చేయాలి. కరివేపాకులో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్ళలో ఉండే మెలనిన్ స్థాయిలను పెంచి జుట్టు నల్లగా మారడానికి సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Click Here To Follow Chaipakodi On Google News