Skincare Tips: శనగ పిండితో మెరిసే చర్మం.. మొటిమలు, మచ్చలకు చెక్.. మరి ఎలా ఉపయోగించాలో తెలుసా..?
Skincare Tips: శనగ పిండితో మెరిసే చర్మం.. మొటిమలు, మచ్చలకు చెక్.. మరి ఎలా ఉపయోగించాలో తెలుసా.. శనగ పిండి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, ఇంకా చర్మంపై నిర్జీవ కణాలను తొలగించడంలో సహాయ పడుతుంది.
అలాగే చర్మ రంధ్రాల లోతుల్లో పేరుకు పోయిన మురికిని శుభ్రం చేయగలదు. శనగ పిండిని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా, మెరిసేలా చేయడంతో పాటు సమస్యలు దూరం అవుతాయి. ఈ క్రమంలో శనగ పిండిని ఎలా ఉపయోగించాలో
ఈ మధ్య కాలంలో ముఖానికి సంబందించిన అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
ప్రతి ఒక్కరూ ముఖం అందంగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటిలో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు.
ఇప్పుడు చెప్పే ప్యాక్ వాడితే ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు అన్ని తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మారుతుంది. శనగపిండి ఆల్కలీన్ స్వభావంను కలిగి ఉండటం వలన చర్మం యొక్క pH స్థాయిలను నిర్వహించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. చర్మం మీద ఉన్న మురికి, టాక్సిన్స్ మరియు ఇతర మలినాలను తొలగిస్తుంది.
చర్మం మీద ఉన్న అదనపు జిడ్డును కూడా తొలగిస్తుంది. శనగపిండి ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మం మీద ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. ఒక బౌల్ లూక స్పూన్ శనగపిండి,ఒక స్పూన్ అలోవేర వేసి బాగా కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. alovera లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ సమృద్దిగా ఉండుట వలన చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది.
ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం తెల్లగా కాంతివంతంగా మారుతుంది. చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం కాంతివంతంగా మారుతుంది. శనగపిండి,కలబంద రెండూ కూడా మనకు చాలా సులభంగా లభ్యం అవుతాయి. కాబట్టి కాస్త శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

