White Hair:తెల్లజుట్టుతో ఇబ్బందిపడుతున్నారా? ఈ సీడ్స్ ట్రై చేస్తే నల్లగా మారడం పక్కా..
White Hair in telugu:అందంగా కనిపించడంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
ఈ క్రమంలోనే జుట్టును నల్లగా మార్చడానికి ఎన్నో కెమికల్స్‌తో కూడిన కలర్స్ వాడుతుంటారు. కానీ ఇవేవి అవసరం లేకుండా ఇంట్లో దొరికే కలోంజి విత్తనాలు అద్భుతమైన రిజల్ట్స్ అందిస్తాయని నిపుణులు అంటున్నారు.
ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. దానితో చాలా కంగారు పడిపోయి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు. తెల్ల జుట్టు రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కలోంజి విత్తనాలు చాలా బాగా సహాయపడతాయి.
kalonji గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే జుట్టుకు సంబంధించి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. కలోంజీ గింజలలో జుట్టు స్కాల్ప్‌ను శుభ్రపరిచే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. కొబ్బరినూనెలో కలోంజి గింజలను వేసి పది నిమిషాలు మరిగించాలి. ఈ నూనెను వడకట్టి చల్లారబెట్టాలి.
ఈ నూనె దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. రాత్రి పడుకొనే ముందు ఈ నూనెను జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటె తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా చుండ్రు సమస్య,జుట్టు రాలే సమస్య తొలగిపోతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

