Beauty Tips

Grey Hair Tips in telugu:తలస్నానానికి 10 నిమిషాల ముందు రాస్తే చాలు.. తెల్లజుట్టు నల్లగా..

White Hair Home remedies: తెల్లజుట్టు సమస్య రాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. తెల్లజుట్టు సమస్య ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే వచ్చేత్సుంది. దాంతో చాలా కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా తయారుచేసుకున్న చిట్కాలను ఫాలో అయితే మంచి పలితాన్ని చాలా తొందరగా చాలా తక్కువ ఖర్చులో పొందవచ్చు. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే సరిపోయుంది. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి అరస్పూన్ మెంతులను వేయాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల టీ పొడి వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి.

మరిగిన ఈ డికాషన్ ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ ఇండిగో పొడి, రెండు స్పూన్ల హెన్నా పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత తయారి చేసి పెట్టుకున్న డికాషన్ వేసి బాగా కలిపి మూడు గంటల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. తెల్లజుట్టు ఎక్కువగా ఉంటె ఎక్కువ వారాల సమయం పడుతుంది. అదే తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఈ చిట్కాలో తీసుకున్న మెంతులు, టీ పొడి, ఇండిగో పొడి, హెన్నా పొడి లలో ఉన్న పోషకాలు తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా జుట్టు కుడుళ్ళను బలంగా మార్చి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అలాగే జుట్టు రాలే సమస్యకు కారణం అయినా చుండ్రును తగ్గించటంలో కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి మరియు వాతావరణంలో కాలుష్యం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువగా చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. సమస్యలు అవ్చ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. అలాగే చాలా సులభంగా అయ్యే ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా సమస్య నుండి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."