Geyser Tips : గీజర్ వాడే వారికి అలర్ట్…. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Geyser tips in telugu : సాదారణంగా ప్రతి ఇంటి బాత్రూమ్స్లో గీజర్స్ ఉంటాయి. వేడి నిటి స్నానం కోసం గీజర్స్ వాడుతూ ఉంటాం. గీజర్స్ వాడినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కరెంట్ లో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు గీజర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే పేలిపోయే ప్రమాదం ఉంది.
పూర్వం కట్టెలపొయ్యి, బొగ్గు పొయ్యిల మీద వేడి నీటిని కాచేవారు. ఆ తర్వాత గ్యాస్ మీద నీటిని వేడి చేసి స్నానానికి ఉపయోగించేవారు. ఆ తర్వాత బాత్రూమ్లోనే గీజర్స్ని పెట్టుకొని…స్విచ్ ఆన్ చేయగానే నిమిషాల్లోనే వేడి నీరు వస్తుంది. అందుకే, దీనిని వాడేందుకు చాలా మంది ఇష్టపడతారు.
అయితే వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. గీజర్లని ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచితే వేడెక్కి పేలే అవకాశం ఉంది. మనలో చాలా మంది గీజర్ ఆన్ చేసి ఆఫ్ సెహ్యటం మర్చిపోతూ ఉంటారు. అప్పుడు గీజర్ వేడెక్కి బాయిలర్ ఒత్తిడి పెరిగి గీజర్ పేలుతుంది.
స్నానం చేసేటప్పుడు గీజర్ ఆఫ్ చేసి అప్పుడు స్నానం చేయాలి. గీజర్‌ని ఎక్కడ పెట్టినా గోడకు, గీజర్‌కి మధ్య కొంచమైన ఖాళీ ఉండాలి. మంచి బ్రాండ్స్ మాత్రమే సెలక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ సిస్టమ్‌తో ఉన్న గీజర్ ని కొనటానికి ప్రయత్నం చేయాలి.
ఎక్కువ ప్రెజర్‌ని కంట్రోల్ చేసేందుకు , ట్యాంక్ పేలుళ్ళ వంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రెజర్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉండాలి. గీజర్ ని ఎప్పటికప్పుడు సర్వీస్ చేయిస్తూ ఉండాలి. బాత్రూమ్ కోసం ఎప్పుడు పెద్ద గీజర్ అంటే 10 నుంచి 35 లీటర్ల గీజర్ ఉండేలా చూసుకోండి.
ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి ప్రమాదం లేకుండా ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది. ప్రస్తుతం వానాకాలం ప్రారంభం అయింది. కాబట్టి దాదాపుగా ప్రతి ఒక్కరూ గీజర్ వాడటం ప్రారంభిస్తారు. కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

