Jr.Ntr:ఎన్టీఆర్ నెం.1 హీరో అవ్వడానికి కారకులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
నందమూరి వంశ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ చాలా తక్కువ సమయంలోనే తానేమిటో నిరూపించుకొని స్టార్ హీరోగా ఎదిగి తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఎన్టీఆర్ ది ప్రత్యేకమైన శైలి. డాన్స్ తో పాటు యాక్టింగ్, డైలాగ్ డెలివరీలోను అదుర్స్ అనిపించే స్టార్ ఎన్టీఆర్. ఈ విషయాన్నీ దర్శక నిర్మాతలతో పాటు అయన తోటి నటులు కూడా ఒప్పుకుంటారు.
అలాంటి ఎన్టీఆర్ కెరీర్ ఎప్పుడు టర్న్ అయిందంటే చాలా మంది చాలా రకాలుగా చెప్పుతారు. ‘ఆది’ సినిమాతో వినాయక్ మొదటి హిట్ ఇవ్వగా…సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ ని అమాంతం పెంచేసాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆ తర్వాత దశాబ్డం పైగా సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ కెరీర్ లో హిట్స్ కన్నా ప్లాప్స్ ఎక్కువ ఉన్నాయన్న విషయాన్నీ అందరు ఒప్పుకుంటారు.
స్టార్ గా ఎన్టీఆర్ ఎప్పుడు ఫెయిల్ కాకపోయినా అయన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూశాయి. ఎన్టీఆర్ కి కొడుకు అభయ్ రామ్ పుట్టాక కెరీర్ బిగ్ టర్న్ తీసుకుందని అయన సన్నిహితులు చెప్పుతూ ఉంటారు. 2014 లో ఎన్టీఆర్ కి అభయ్ రామ్ జన్మించాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ కెరీర్ లో సక్సెస్ లు క్యూ కట్టటం ప్రారంభం అయింది.
రభస సినిమా యావరేజ్ అనిపించుకున్న ఆ తర్వాత వచ్చిన ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. ఇక ఆ తర్వాత వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ఏకంగా జూనియర్ ని వంద కోట్ల క్లబ్ లో చేరేలా చేసి ఎవరు ఊహించని విజయాన్ని అందించింది. ఇలా తనయుడు తన జీవితంలోకి వచ్చాక తన కెరీర్ పూర్తిగా మారిపోయిందని ఎన్టీఆర్ అంటూ ఉంటాడు.
కొడుకు అంటే ఎన్టీఆర్ కి పంచ ప్రాణాలని ఎన్టీఆర్ సన్నిహితులు చెప్పుతూ ఉంటారు. మొత్తం మీద ఎన్టీఆర్ కి ఎంత టాలెంట్ ఉన్నా ఆయనకు పూర్తి స్థాయిలో అదృష్టం కలిసి వచ్చింది మాత్రం కొడుకు అభయ్ రామ్ పుట్టాకే.

