Face Glow Tips:అరటిపండుతో అందం.. ఇలా వాడితే మీ ముఖం మెరిసిపోవడం ఖాయం..!
Skin Care With Banana : అరటి పండు..అందరికీ అందుబాటులో ఉండే అద్భుత ఫలం..ఎంతో రుచికరంగా ఉండే ఈ అరటిపండులో పోషకాలు సైతం బోలెడు ఉన్నాయి. అయితే అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే, కాదు.. అందానికి కాకుండా దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అరటి పండులో ఉండే పోషకాలు చర్మాని కాంతివంతంగా మార్చుతాయి.
అరటి పండులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య,బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. సంవత్సరం పొడవునా చాలా తక్కువ ధరలో చాలా విరివిగా లభించే అరటి పండుతో ఇప్పుడు చెప్పే ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
ఈ ప్యాక్ యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్లతో నిండి ఉంటుంది. చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేస్తాయి. అరటిపండులో జింక్ మరియు మాంగనీస్ సమృద్దిగా ఉండుట వలన మొటిమలను, నల్లని మచ్చలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
ఈ ప్యాక్ లో అరటి పండుతో పాటు పెరుగు,తేనే కూడా కలుపుతున్నాం. పెరుగు,తేనెలో ఉన్న పోషకాలు చర్మానికి పోషణ అందించి కాంతివంతం చేయటంలో సహాయపడుతుంది. బాగా పండిన అరటిపండులో సగం తీసుకోని మెత్తగా చేయాలి.
ఒక బౌల్ లో అరటి పండు గుజ్జు, ఒక స్పూన్ తేనే, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 5 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
ఈ ప్యాక్ లో ఉన్న పోషకాలు చర్మం మీద నల్లని మచ్చలు, మొటిమలు లేకుండా తెల్లగా మెరిసేలా చేస్తుంది. ఈ మూడు ఇంగ్రిడియన్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ ప్యాక్ ని ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

