Beauty Tips

White Hair: ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..

White Hair Turn Black: స్త్రీ అయినా, పురుషుడైనా.. ఇద్దరికీ వారి వారి శరీరాల్లో బాగా ఇష్టమైంది జుట్టు. జుట్టుకిచ్చే ప్రాధాన్యత దేనికీ ఇవ్వరు. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే అది వారికి తలపై కిరీటంలాంటిది కాబట్టి. అటువంటి కిరీటం ఊడిపోతోందన్నా, రాలిపోతోందన్నా, నల్లగా నిగనిగలాడే జుట్టు తెల్లబడిపోతోందన్నా ఎంతో బాధేస్తుంది. అందం తగ్గిపోతుందని బాధపడిపోతుంటారు.

ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితి,ఒత్తిడి, జుట్టుకి సరైన పోషణ లేకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకి సంబందించిన అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా తెల్లజుట్టు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

తెల్లజుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులో అంటే 25 నుంచి 30 ఏళ్ళు వచ్చేసరికి వస్తుంది. దాంతో చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడేస్తూ ఉంటారు. వాటి కారణంగా జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది.

అలా కాకుండా ఇంటిలో సహజసిద్దంగా తయారుచేసుకొనే ప్యాక్ లను వేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ ఉసిరి పొడి, రెండు స్పూన్ల బ్లాక్ టీ, ఒక స్పూన్ కాఫీ పొడి,ఒక స్పూన్ ఇండిగో పొడి, ఒక స్పూన్ brahmi powder, ఒక స్పూన్ త్రిఫల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిస్రమంను ఒక లీటర్ నీటిలో కలిపి బాగా మరిగించాలి.

ఈ నీటిని వడకట్టి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."