Beauty Tips

White Hair turn Black:తెల్లజుట్టు నల్లబడాలంటే ఆముదంతో ఇలా చేయాల్సిందే?

White Hair Home Remedies:ఈ మధ్య కాలంలో తెల్లజుట్టు సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య కనిపిస్తుంది. తెల్లజుట్టు సమస్య రాగానే చాలా మంది కంగారు పడుతూ ఉంటారు.

అలా కంగారు పడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సహజసిదంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. కాస్త ఓపిక,సమయం కేటాయిస్తే సరిపోతుంది.

ఆముదం,కొబ్బరి నూనె తెల్లజుట్టును నల్లగా మార్చటంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ రెండింటిని పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ఈ రెండూ కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి.

ఒక బౌల్ లో ఒక స్పూన్ ఆముదం,ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకోని బాగా కలిపి జుట్టుకి పట్టించి అరగంట తర్వాత రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి పలితం వస్తుంది.

ఆముదం,కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు తల మీద రక్తప్రసరణను మెరుగు పరచి తెల్లజుట్టు రాకుండా నివారిస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి కూడా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.