Beauty Tips

Tips To Remove Blackheads: ఈ సింపుల్‌ టిప్స్‌తో.. బ్లాక్‌హెడ్స్‌ మాయం అవుతాయ్‌..!

Tips To Remove Blackheads:ముఖం మీద ఎటువంటి సమస్యలు వచ్చిన ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా శ్రద్దగా చేసుకోవాలి. అప్పుడే మంచి పలితాలను పొందవచ్చు.

ముక్కు భాగంలో కొన్నిసార్లు బ్లాక్ హెడ్స్ లాంటివి వస్తుంటాయి. వాటిని గోరుతో లాగడం, గిల్లడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. మరికొన్ని సార్లు హెడ్స్ రాకుండా అక్కడే ఉండిపోతాయి. వీటిని సులువుగా తగ్గించి మళ్ళీ రాకుండా చేయటానికి మంచి ఇంటి చిట్కా ఉంది. దీని కోసం ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు.

ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి వేసి దానిలో రోజ్ వాటర్ వేసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని
ముక్కు భాగంలో బ్లాక్ హెడ్ ఉన్న ప్రదేశంలో రాసి స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత 5 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు చేస్తే మూడు రోజుల్లో బ్లాక్ హెడ్స్ అనేవి తొలగిపోతాయి.

వీపు మీద వచ్చిన నల్ల మచ్చలు, హెడ్స్ కి కూడా ఇలా చేస్తే తగ్గుతాయి. ఈ పేస్ట్ బాగా పనిచేస్తుంది. శనగపిండిని పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో వాడుతున్నారు. చర్మం మీద మృత కణాలను తొలగిస్తుంది. రోజ్ వాటర్ లో ఉన్న లక్షణాలు కూడా బ్లాక్ హెడ్స్ తొలగించటానికి చాలా బాగా పనిచేస్తుంది.

కాస్త ఓపికగా చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో బ్లాక్ హెడ్స్ ని తగ్గించుకోవచ్చు. శనగపిండి చర్మంపై ఉన్న నలుపును కూడా తగ్గిస్తుంది. శనగపిండి,రోజ్ వాటర్ సులభంగానే అందుబాటులో ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."