Beauty TipsHealthhealth tips in telugu

ఎన్ని షాంపూలు వాడినా చుండ్రు తగ్గట్లేదా? అయితే ఈ ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండి!

Dandruff Home Remedies :నల్లటి బట్టలు వేసుకోవాలంటేనే భయమేస్తోందా? టీవీలో యాడ్స్ చూసి ఎన్ని రకాల షాంపూలు మార్చినా ఆ చుండ్రు మాత్రం మిమ్మల్ని వదలట్లేదా? మీ బాధ నాకు అర్థమైంది.

అందుకే, ఎలాంటి కెమికల్స్ వాడకుండా మన వంటగదిలో దొరికే వస్తువులతోనే చుండ్రును సులభంగా ఎలా వదిలించుకోవచ్చో ఈ పోస్ట్‌లో రాశాను. ఒక్కసారి ఈ ఇంటి చిట్కాలు ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది!

చుండ్రు సమస్య అనేది ఒక్కసారి వచ్చిందంటే అంత తొందరగా వదలదు. చుండ్రు సమస్య కారణంగా జుట్టు రాలే సమస్య కూడా వస్తుంది. చుండ్రు సమస్యను ప్రారంభంలోనే తగ్గించుకోవాలి. ఈ సమస్యను తగ్గించుకోవటానికి ఖరీదైన నూనెలను,షాంపూలను వాడవలసిన అవసరం లేదు.

మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో తగ్గించుకోవచ్చు. చుండ్రు నివారణ కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఎండిన ఉసిరి ముక్కలను నీటిలో వేసి అరగంట నానబెట్టాలి.

గుప్పెడు తులసి ఆకులను శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేయాలి. ఆ తర్వాత నానిన ఉసిరి ముక్కలను వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఎండిన ఉసిరి ముక్కలు మార్కెట్ లో లభ్యం అవుతాయి.

ఉసిరి ముక్కలు దొరక్కపోతే ఉసిరి పొడి ఉపయోగించవచ్చు. తులసి పొడిని కూడా వాడవచ్చు. తులసి,ఉసిరి పేస్ట్ ని జుట్టుకి పట్టించి అరగంట అలా వదిలేసి ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య క్రమంగా తగ్గిపోతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

తులసి,ఉసిరిలో ఉన్న లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గించటానికి మరియు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి చాలా బాగా సహాయపడుతుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా మంచి ఫలితం వస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."