MoviesTollywood news in telugu

Suneel remuneration:సునీల్ ఒకరోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Suneel remuneration: తెలుగులో టాప్ కమెడియన్ గా ఒకప్పుడు మంచి రేంజ్ లో ఉన్న సునీల్.. అప్పట్లో ఒక్కో సినిమాకు దాదాపుగా 10 లక్షల పారితోషికం తీసుకునేవారు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ కూడా మంచి మార్కులే పడ్డాయి.

అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మళ్లీ కమెడియన్ గా మారారు.రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో మంచి క్రేజ్ సంపాదించి వరుస హీరోగా సినిమాలు చేసాడు.

పూలరంగడు సినిమాకు 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఆ తర్వాత అతను నటించిన సినిమాలన్నీ ఫెయిలయ్యాయి. కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్లీ కామెడీ రోల్స్ లో నటిస్తున్నాడు. ఇవి కూడా కొన్ని ఫెయిలయ్యాయి.

దాంతో ట్రాక్ మార్చి నెగెటివ్ పాత్రలు చేయడం మొదలు పెట్టారు. కలర్ ఫొటో సినిమాలో విలన్ గా నటించిన తర్వాత పుష్ప సినిమాతో మంచి పాపులారిటీని పెంచుకొని మరల బిజీగా సినిమాలు చేస్తున్నాడు. సునీల్ ఒక్కో చిత్రానికి రోజుకు రూ.6 లక్షలు తీసుకుంటున్నాడు.