Devotional

Rudraksha and Zodiac Signs:రుద్రాక్ష శివుడి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది..! మీ రాశి ప్రకారం ధరిస్తే అదృష్టం మీ వెంటే..?

Rudraksha and Zodiac Signs:రుద్రాక్ష శివుడి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది..! మీ రాశి ప్రకారం ధరిస్తే అదృష్టం మీ వెంటే..? శివానుగ్రహానికి రుద్రాక్ష ఎంతో మంచిదని చెబుతారు. పైగా రాశుల వారీగా ఎవరు ఏ రకం రుద్రాక్ష పూజించి ధరిస్తే మంచిదో కూడా పండితులు చెబుతారు. చాలామంది జాతకాలను నమ్మేవాళ్ళు , సెంటిమెంట్స్ నమ్మేవాళ్ళు ఇలాంటి వాటిని ఆచరణలో పెట్టడం చూస్తూనే ఉన్నాం.

అయితే రాశుల వారీగా చూస్తే, మేష రాశి వాళ్ళు అదృష్టం కోసం ఏక ముఖి, త్రిముఖి, పంచముఖి రుద్రాక్షలలో ఏదో ఒకటి ధరిస్తే మంచిదంటారు. వృషభ రాశి వారు సుఖ సంతోషాల కోసం చతుర్ముఖ, షట్ ముఖాలు /పద్నాలుగు ముఖాలు గల రుద్రాక్షలను ధరిస్తే మంచిదని అంటారు. మిథున రాశి వాళ్ళు చతు ర్ముఖ, పంచముఖ, 13 ముఖాల రుద్రాక్షలలో ఏదో ఒకటి ధరిస్తే మంచిదంటారు

కర్కాటక రాశి వాళ్ళైతే త్రిముఖి, పంచముఖ/ గౌరీ-శంకర్ రుద్రాక్షలను ధరిస్తే మంచిందని చెబుతారు. సింహ రాశి వారి అదృష్టాన్ని పెంచడానికి ఏక ముఖి, మూడు కియా ముఖి, పంచముఖి రుద్రాక్షలను ధరిస్తే మంచిదంటారు. కన్యా రాశి వారైతే చతుర్ముఖి, పంచముఖి, 13 ముఖాల రుద్రాక్షను ధరించడం చాలా మంచిదని అంటారు.

తులారాశి వాళ్ళు అదృష్టాన్ని పొందడానికి చతుర్ముఖి, షట్ముఖి / 14 ముఖాల రుద్రాక్షలను ధరించడం శుభదాయకమని అంటారు. వృశ్చిక రాశి వాళ్ళు వ్యక్తి తన నిద్రావస్థను మేల్కొల్పడానికి త్రిముఖి, పంచముఖి /గౌరీ-శంకర్ రుద్రాక్షను ధరించడం మంచిదని అంటారు. ధనుస్సు రాశి వాళ్ళు తమ అదృష్టాన్ని పెంచుకోవడానికి ఏక ముఖి, త్రిముఖి/ పంచ ముఖి రుద్రాక్షలను ధరించడం శుభప్రదంగా చెబుతారు.

మకర,కుంభ రాశి వాళ్ళు తమ అదృష్టాన్ని పెంచుకోవడానికి చతుర్ముఖి, షట్ముఖి/ 14 ముఖాల రుద్రాక్ష ధరించడం శుభప్రదంగా చెబుతారు. మీన రాశి వాళ్ళైతే త్రిముఖి, పంచముఖి /గౌరీ-శంకర్ రుద్రాక్షలను ధరించడం ఉత్తమమని అంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."