Beauty Tips

తెల్ల జుట్టుతో విసిగిపోయారా? ఈ ఒక్క హెయిర్ మాస్క్‌తో శాశ్వత పరిష్కారం!

White Hair Solution: తెల్ల జుట్టు వస్తుందని బాధపడకండి, ఈ మాస్క్‌తో తెల్ల జుట్టుకు చెక్‌.. తెల్లజుట్టు సమస్యతో బాధపడేవారు ఇప్పుడు చెప్పే ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది. ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు వేస్తే చాలా అద్భుతమైన పలితాన్ని పొందవచ్చు. ఈ సీజన్ లో ఆకు కూరలు చాలా విరివిగా లభ్యం అవుతాయి.

మెంతి కూరను ఉపయోగించి తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. మెంతి ఆకులను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసి దానిలో కొబ్బరి నూనె వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక తలస్నానం సెహ్యాలి.

మెంతి కూర దొరకనప్పుడు ఎండిన మెంతి ఆకులను ఉపయోగించవచ్చు. ఎండిన మెంతి ఆకులను పొడిగా చేసుకొని హెన్నా కలపాలి. ఆ తర్వాత కొబ్బరి నూనె వేసి గంట అలా వదిలేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివరల వరకు పట్టించి రెండు గంటల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా కలర్‌ చేసిన తర్వాత మరుసటి రోజు జుట్టుకు బాగా నూనె రాసుని షాంపూతో తలస్నానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే సులభంగా మంచి ఫలితాలు పొందవచ్చు. తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. ఈ రెండు చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

తెల్లజుట్టు రాగానే కంగారు పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వైపు అడుగులు వేస్తారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."