Beauty Tips

30 ఏళ్లకే తెల్ల జుట్టు వేధిస్తోందా? ఈ సింపుల్ చిట్కాలతో నల్లగా మార్చుకోండి!

White Hair Turn Black:ముప్పై ఏళ్ల వయస్సుకే తెల్ల జుట్టు వచ్చేసిందా.. జుట్టు సంరక్షణలో కరివేపాకు చాలా బాగా సహాయపడుతుంది. కరివేపాకును ఉపయోగించడం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. జుట్టుకు విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, ప్రొటీన్, బీటా కెరోటిన్‌లను అందిస్తాయి.

మనకు కరివేపాకు కూడా చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. కరివేపాకు జుట్టు కుదుళ్ళను బలోపేతం చేసి జుట్టుకు అవసరమైన పోషణ అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా తెల్లజుట్టును నల్లగా మార్చటంలో కూడా సహాయపడుతుంది.

పొయ్యి మీద పాన్ పెట్టి కొబ్బరి నూనె పోసి కొంచెం వేడి అయ్యాక కరివేపాకు ఆకులను వేసి బాగా వేగే వరకు వేగించి ఆ నూనెను వడకట్టి జుట్టుకు ప్రతి రోజు రాసుకుంటే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి.

కరివేపాకును హెయిర్ మాస్క్ గా తయారు చేసుకోవచ్చు. పావు కప్పు కరివేపాకులో అరకప్పు పెరుగు కలిపి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ళకు పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి పలితం ఉంటుంది.

ఇప్పుడు చెప్పిన రెండు విధానాలలో మీకు ఏ విధానం సులభంగా ఉంటుందో ఆ విధానాన్ని ఫాలో అయ్యి జుట్టు రాలే సమస్య, తెల్లజుట్టు సమస్య నుండి బయట పడవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా జుట్టు సమస్యల నుండి బయట పడవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."