Beauty Tips

కేవలం 10 నిమిషాల్లో తెల్లజుట్టును సహజంగా నల్లగా మార్చుకోండిలా!

White Hair:10 నిమిషాల సమయం ఉంటే చాలు తెల్లజుట్టు నల్లగా మారటం ఖాయం.. మారిన పరిస్థితి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు రాకుండా ఉండాలంటే ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మన ఇంటిలో ఉన్న సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా సమస్య నుండి బయట పడవచ్చు.

ఈ రోజుల్లో తెల్లజుట్టు సమస్య అనేది సాదరణం అయ్యిపోయింది. వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావటంతో కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. ఇలా వాడటం వలన జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఒక బౌల్ లో మెత్తని పొడి చేసుకున్న టీ పొడి ఒక స్పూన్, అరస్పూన్ కాఫీ పొడి, 50 ml కొబ్బరినూనె, అరచెక్క నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకొని డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేయాలి.

నూనె వేడి అయ్యాక గాజు సీసాలో వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనె 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ నూనెను ఎప్పటికప్పుడు కూడా తయారుచేసుకోవచ్చు. ఈ నూనెను గోరువెచ్చగా చేసుకొని తలకు పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేసి 2 గంటలు అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య కూడా తొలగిపోతాయి. అయితే ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం, తక్కువ తెల్లజుట్టు ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. అయితే ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."