White Hair Turn Black:ఆవ నూనెలో కలపి రాస్తే చాలు.. తెల్లజుట్టు నల్లగా మారుతుంది
White Hair Turn Black:ఆవ నూనెలో కలపి రాస్తే చాలు.. తెల్లజుట్టు నల్లగా మారుతుంది .. తెల్లజుట్టు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.
వాతావరణంలో కాలుష్యం మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా.. ఆ ప్రభావం జుట్టు మీద పడుతుంది. 25 నుంచి 30 ఏళ్ల వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వస్తుంది. అప్పుడు వయస్సు ఎక్కువ ఉన్నవారిగా కనిపిస్తారు.
జుట్టును నల్లగా మార్చుకోవడానికి మార్కెట్‌లో చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి, అయితే జుట్టు తెల్లగా మారకుండా నిరోధించడానికి సహజసిద్దమైన పద్దతులు కూడా చాలానే ఉన్నాయి.
జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు, జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో, జుట్టులో మెలనిన్ మొత్తాన్ని పెంచే వాటిని ఉపయోగిస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.
రాత్రి సమయంలో ఒక ఇనుప పాన్ లో మూడు స్పూన్ల ఆవాల నూనె, రెండు రెబ్బల కరివేపాకు,ఒక స్పూన్ మెంతులు, ఒక మందార పువ్వు వేసి వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఈ పాన్ పై మూత పెట్టాలి.
మరుసటి రోజు ఉదయం ఈ నూనెను జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
అవ నూనెలో మెలనిన్ ఉంటుంది మరియు మందార పువ్వు కూడా తెల్లజుట్టును నివారిస్తుంది. తెల్లజుట్టు రావటం ప్రారంభం అయినా వెంటనే ఈ నూనెను వాడితే తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా.. నల్లజుట్టు తెల్లగా మారకుండా చేస్తుంది.
ఇది కూడా చూడండి:ప్రతి వంటగదిలో ఉండవలసిన అతి ముఖ్యమైన వస్తువు.. పైర్ బ్లాంకెట్
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


