Beauty Tips

White Hair:ఇలా చేస్తే ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించదు..

White Hair:ఇలా చేస్తే ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించదు.. ఒకప్పుడు వయస్సు 50 ఏళ్ళు దాటాక తెల్లజుట్టు అనేది వచ్చేది. కానీ ఇప్పటి రోజుల్లో 25 ఏళ్ళు వచ్చే సరికి తెల్లజుట్టు సమస్య వచ్చేస్తుంది.

తెల్లజుట్టు సమస్య వచ్చినప్పుడు ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తెల్లజుట్టు సమస్య ప్రారంభం కాగానే చిట్కాలను ఫాలో అయితే తొందరగా మంచి పలితాన్ని పొందవచ్చు.

ఇటీవల కాలంలో విపరీతమైన టెన్షన్,జుట్టు పట్ల శ్రద్ధ తీసుకోకపోవడం వంటి కారణాలతో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య ఎక్కువ అయింది.దీనికోసం రకరకాల ప్రొడక్ట్స్ వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దీని కోసం మన పెద్దవారు వాడిని ఒక మంచి చిట్కా ఉంది.

ఈ చిట్కా ఫాలో అయితే తెల్ల జుట్టు సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే జుట్టు రాలే సమస్య ఆగిపోతుంది. ఒక గిన్నెలో ఒక స్పూన్ ఆవనూనె తీసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ ఆముదం వేయాలి. ఆ తర్వాత పావు స్పూను నిమ్మరసం వేయాలి. ఆవనూనె నిమ్మరసం ఆముదం బాగా కలిసేలా బాగా కలిపి తలకు పట్టించాలి.

రాత్రి సమయంలో తలకు రాసి క్యాప్ పెట్టి మరుసటి రోజు తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తుంటే జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది.ఈ విధంగా కొన్ని వారాల పాటు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

అంతేకాకుండా జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. తెల్లజుట్టు సమస్యకు ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.