MoviesTollywood news in telugu

keerthy suresh:కీర్తి సురేష్ తొలి పారితోషికం ఎంత.. ఏమి చేసిందో తెలుసా..?

keerthy suresh:కీర్తి సురేష్ తొలి పారితోషికం ఎంతో తెలుసా… సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన కీర్తి సురేష్ తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత. తల్లి మేనక ఒకప్పటి హీరోయిన్.

2000లోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కీర్తి. మూడు సంవత్సరాలు ఇండస్ట్రీలోనే పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్ డిగ్రీ పూర్తి చేసి మలయళంలో గీతాంజలి సినిమా ద్వారా కథానాయికగా అడుగుపెట్టింది.

ఆ తర్వాత టాలీవుడ్ కి నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా చాలా బిజీగా ఉంది. కీర్తి సురేష్ ఒక్కో సినిమాకు దాదాపుగా మూడు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంది.

మొదట బాలనటిగా నటించిన కీర్తి సురేష్ తన పారితోషికం మొత్తం తన తండ్రికి ఇచ్చేదట. కాలేజీ రోజుల్లో ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్నందుకు 500 రూపాయల పారితోషికం ఇచ్చారట. కీర్తి సురేష్ మొదటి పారితోషికం 500 రూపాయిలు అని ఆమె ఒక సినిమా ప్రమోషన్ లో బాగంగా చెప్పింది. ప్రస్తుతం కీర్తి హిందీలో వరుణ్ ధావన్ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."