Beauty Tips

Rice Flour For Face:బియ్యంపిండితో ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మారుతుంది

Rice Flour For Face:బియ్యంపిండితో ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మారుతుంది.. మనలో చాలా మంది ముఖం తెల్లగా ఉండాలని బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వక చాలా నిరాశ చెందుతారు.
Carrot
ఈ చిట్కా ఫాలో అయితే అసలు నిరాశ చెందకుండా ముఖం తెల్లగా మెరిసిపోవటం ఖాయం. దీని కోసం కలబందలోని జెల్ తీసుకొని మెత్తని పేస్ట్ గా చేసి వడకట్టి జెల్ తీయాలి. ఈ జెల్ ని పది నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తర్వాత చిన్న క్యారెట్ తీసుకొని పైతొక్క తీసి తురిమి మిక్సీలో వేసి జ్యూస్ గా తయారుచేసుకోవాలి.

ఈ జ్యూస్ లో రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసి డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేసి క్రీమ్ అయ్యేలా కలుపుతూ ఉండాలి. ఈ క్రీమ్ లో ఆలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకొనే ముందు ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. ముఖాన్ని సబ్బుతో రుద్దకూడదు. మరుసటి రోజు ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవచ్చు.

క్యారెట్ లో ఉన్న విటమిన్ A చర్మం మీద మచ్చలు,మొటిమలు లేకుండా చేస్తుంది. ఆలోవెరా ముఖం మీద మృత కణాలను తొలగిస్తుంది. ఈ క్రీమ్ ని రాత్రి సమయంలో మాత్రమే రాయాలి. ఈ వేసవిలో ముఖానికి చల్లదనాన్ని ఇస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."