White Hair Turn black:ఈ నీటితో ఒకసారి ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది
White Hair Turn black:ఈ నీటితో ఒకసారి ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.. తెల్లజుట్టు సమస్య వచ్చినప్పుడు కంగారు పడకుండా బయట దొరికే ఉత్పత్తులను వాడకుండా ఇంటి చిట్కాలను వాడితే మంచి ప్రయోజనం కనపడుతుంది.
మారిన పరిస్థితి కారణంగా చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య అనేది వచ్చేస్తుంది. ఒకప్పుడు 60 ఏళ్ళు వచ్చాక వచ్చే తెల్లజుట్టు సమస్య చాలా చిన్న వయస్సులోనే రావటంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు.
దాంతో చాలా కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడుతున్నారు. అలా వాడటం వలన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయ. సహజ సిద్దమైన ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సమస్యలు ఉండవు.
ఉసిరి తెల్లజుట్టును నల్లగా మార్చటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన తెల్లజుట్టును నల్లగా మార్చటంతో పాటుగా జుట్టు కుడుళ్ళను బలంగా మార్చి జుట్టు రాలకుండా కాపాడుతుంది.
ఉసిరి జుట్టుకు హెయిర్ టానిక్‌గా పనిచేస్తుంది. 5 ఉసిరికాయలను తీసుకోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి జుట్టుకి పట్టించి గంట అయ్యాక తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. సీజన్ లో ఉసిరి కాయలను ముక్కలుగా కట్ చేసి బాగా ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు. లేదంటే మార్కెట్ లో లభ్యం అవుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


