Anu Mehta: ఆర్య హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఆమె రేంజ్ ఏంటంటే?
Anu Mehta: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన బ్యూటీఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆర్య సినిమాలో నటించిన అను మెహతా తన సైలెంట్ నటనతో కుర్రాళ్ల గుండెల్ని మీటింది.
ఆర్య సినిమా లో గీత గా నటించిన అనురాధ మెహతా గురించి మనందరికీ తెలుసు. ఆమె ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన నువ్వంటే నాకిష్టం సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమా హిట్ కాకపోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత నటించిన ఆర్య సినిమా హిట్ అయినా ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు.
దాంతో తమిళ, కన్నడ, మలయాళం వైపుకు వెళ్లి హీరోయిన్ గా ట్రై చేసింది. అక్కడ కూడా పెద్దగా సక్సెస్ రాలేదు. దాంతో సినిమా పరిశ్రమను వదిలి దూరంగా వెళ్ళిపోయింది. అనురాధ మెహతా సినిమాకి సంబంధించిన ఎటువంటి వేడుకలకు హాజరు కాదు.
ఆమె అంతలా సినిమాలకు దూరంగా ఉంది. అందం అభినయం, నటన ఉన్న ఈ తెలుగు అమ్మాయి కి అవకాశాలు రాకపోవడం ప్రేక్షకులు అసలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆర్య మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిన బ్యూటీ.. కేవలం నాలుగేళ్లకే ఇండస్ట్రీని విడిచిపెట్టింది.


