Beauty Tips

White Hair Problems : తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడేందుకు ఆయుర్వేద చిట్కా

White Hair Problems : తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడేందుకు ఆయుర్వేద చిట్కాలు.. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి, ఒత్తిడి, రసాయనాలు ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను వాడటం వంటి అనేక రకాల కారణాలతో చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వచ్చేస్తుంది.

తెల్లజుట్టు సమస్యను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయించి ఈ చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండ తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల బాదం నూనె, మూడు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలిపి.. జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి అరగంట తర్వాత రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వరలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. బాదం నూనెలో విటమిన్ ఇ సమృద్దిగా ఉండుట వలన జుట్టు కుదుళ్ళకు బలాన్ని అందించటమే కాకుండా తెల్లజుట్టును నివారిస్తుంది.

నిమ్మరసం జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహించటమే కాకుండా జుట్టు కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. నిమ్మరసం, బాదం నూనె రెండింటిలోను ఉన్న పోషకాలు తెల్లజుట్టును తగ్గించటానికి సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."