MoviesTollywood news in telugu

Sakshi Shivanand: 90ల్లో యూత్ క్రష్ సాక్షి శివానంద్.. ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా..?

Sakshi Shivanand:ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు అలా వచ్చి ఎంటర్ టైన్ ఇలా వెళ్లిపోతుంటారు. కానీ ప్రేక్షకుల మనస్సులపై చెరగని ముద్ర వేస్తుంటారు. ఇలాంటి హీరోయిన్లు నటనా రంగం నుండి తప్పకున్నా.. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే చూడాలని అనుకుంటారు. వారిలో ఒకరు సాక్షి శివానంద్.

సాక్షి శివానంద్ తెలుగులో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్.1996లో ఆమె బాలీవుడ్ లోకి మొట్టమొదటి సారిగా అడుగు పెట్టింది.తరువాత తెలుగులో సినిమా అవకాశాలు రావడంతో అక్కడ మంచి పేరు సంపాదించుకుంది.

ఆమె తెలుగులో నటించిన మొదటి సినిమా చిరంజీవి కథానాయకుడిగా నటించిన మాస్టర్.అది మంచి ప్రజాదరణ పొందడంతో ఆమెకు తెలుగులో ప్రముఖ కథానాయకుల సరసన నటించేందుకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.అక్కినేని నాగార్జునతో సీతారామరాజు, మహేష్ బాబుతో యువరాజు, బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్ తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు సినిమాలలో కథానాయికగా నటించింది.

మంచి హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న టైం లో సడన్ గా ఈ అమ్మడు సినిమాలనుండి మాయం అయ్యింది.ఐదేళ్ల క్రితం వచ్చిన ‘హోమం’ సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా మళ్లీ ఇక్కడ ప్రత్యక్షమైంది.‘రంగ ది దొంగ’ సినిమాలో ‘మిల మిల మిల మీనాక్షి.’ అంటూ సాగే పాటలో మళ్లీ తళుక్కున మెరిసింది.ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు.గత యేడాది ఆమె ఒక హిందీ సినిమాలో నటించింది.

తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని పాత్ర బాగుంటే సినిమా చేస్తానని చెబుతోంది సాక్షి.సాక్షి శివానంద్ పెళ్ళి చేసుకున్న విషయం కూడా చాలా మందికి తెలీదు.ఎందుకంటే ఆమె పెళ్ళి ఫోటోలు కూడా బయటకు రాలేదు.సాగర్ అనే ఒక బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుంది సాక్షి.ప్రస్తుతం సాక్షి తన భర్త కు ఉన్న వ్యాపారాలు చూసుకుంటూ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."