MoviesTollywood news in telugu

Tollywood:చాలా మందికి తెలియని టాలీవుడ్ షాకింగ్ రిలేషన్స్…చూడండి

Tollywood:చాలా మందికి తెలియని టాలీవుడ్ షాకింగ్ రిలేషన్స్…చూడండి.. అలనాటి మేటి నటి సావిత్రి బాలీవుడ్ నటి రేఖకు పిన్ని అవుతుంది. రేఖ తల్లికి కూడా జెమిని గణేశన్ భార్య కావడంతో ఈ రిలేషన్ ఏర్పడింది. కళాతపస్వి కె విశ్వనాధ్, నటుడు చంద్రమోహన్, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వరుసకు అన్నదమ్ములు అవుతారు. అలనాటి హీరోయిన్స్ విజయనిర్మల సహజ నటి జయసుధకు మేనత్త కావడంతో సూపర్ స్టార్ కృష్ణకు జయసుధ మేనకోడలు అవుతుంది.
Tollywood Actress sridevi net worth
టాలీవుడ్, బాలీవుడ్ లో అందాల నటిగా రాణించిన శ్రీదేవి అక్క కూతురే హీరోయిన్ మహేశ్వరీ. విశ్వ నటుడు కమల్ హాసన్ కి సుహాసిని కూతురు అవుతుంది. కమల్ బ్రదర్ చారు హాసన్ కూతురే సుహాసిని. హీరో సందీప్ కిషన్ స్వయానా కెమెరామెన్ చోటా కె నాయుడుకి మేనల్లుడు. మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మన్, యాక్టర్ రెహ్మన్ ఇద్దరూ కో బ్రదర్స్ అంటే తోడల్లుళ్లు. వీరి భార్యలు స్వయంగా అక్కా చెల్లెళ్ళు.

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కి సూపర్ స్టార్ రజనీకాంత్ మేనమామ అవుతారు. రజనీకాంత్ భార్య అనిరుద్ తండ్రికి చెల్లెలు. హీరో కార్తీకి నగ్మా వదిన అవుతుంది. ఎందుకంటే నగ్మా చెల్లెలు జ్యోతికను కార్తీ అన్నయ్య సూర్య పెళ్లి చేసుకున్నాడు. రియల్ స్టార్ శ్రీహరి, ప్రకాష్ రాజ్ తోడల్లుళ్లు. ప్రకాష్ రాజ్ మొదటి భార్య స్వయంగా శ్రీహరి భార్యకు అక్కయ్య.

విద్యాబాలన్, ప్రియమణి కజిన్స్. రైటర్ సుద్దాల అశోక్ తేజకు నటుడు ఉత్తేజ్ వరుసకు మేనల్లుడు అవుతాడు. గుణ్ణం గంగరాజు, ఎస్ ఎస్ రాజమౌళి బావాబావమరుదులు. రమా రాజమౌళికి గంగరాజు అన్నయ్య. సీనియర్ యాక్టర్ రాధిక, నిరోషా వరుసకు అక్కాచెల్లెళ్లు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి బంధువుల అమ్మాయిని త్రివిక్రమ్ శ్రీనివాస్ పెళ్లిచేసుకోవడంతో సిరివెన్నెలకు త్రివిక్రమ్ కొడుకు వరుస అవుతారు. రచయిత, నటుడు, డైరెక్టర్ పోసాని కృష్ణ మురళికి టాప్ డైరెక్టర్ కొరటాల శివ మేనల్లుడు అవుతాడు. చైల్డ్ ఆర్టిస్టుగా చేసి, ఇప్పుడు క్యారెక్టర్ యాక్టర్ గా చేస్తున్న సుజిత అన్నయ సూర్య కిరణ్ డైరెక్టర్.

అతడిని పెళ్లిచేసుకోవడంతో హీరోయిన్ కళ్యాణి, సుజిత మధ్య వదిన, ఆడపడుచు బంధం ఏర్పడింది. హీరోయిన్ శోభన కు హీరో వినీత్ కజిన్ అవుతాడు. హీరో శ్రీకాంత్ మేనకోడలిని హీరో గోపీచంద్ పెళ్లి చేసుకోవడంతో బంధుత్వం ఏర్పడింది. డైరెక్టర్ మెహర్ రమేష్ స్వయానా మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు వరుస. దాంతో రామ్ చరణ్ తో బంధుత్వం ఏర్పడింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."