Hair care Tips:ఈ ఆకులతో షాంపూ తయారుచేసి తలస్నానం చేస్తే జుట్టు రాలకుండా పెరుగుతుంది
Hair care Tips:ఈ ఆకులతో షాంపూ తయారుచేసి తలస్నానం చేస్తే జుట్టు రాలకుండా పెరుగుతుంది.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ లో ఎక్కువగా కెమికల్స్ ఉండుట వలన జుట్టు బలహీనంగా మారుతుంది. కాబట్టి ఇంట్లోనే నేచురల్ గా షాంపూని తయారుచేసుకొని వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

గుప్పెడు కరివేపాకు ఆకులను మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో కరివేపాకు పేస్ట్ వేసి, ఆతర్వాత ఒక స్పూన్ ఉసిరి పొడిని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత 10 నుంచి 15 కుంకుడు కాయలను లోపల గింజలు తీసేసి వేయాలి. 10 నిమిషాల పాటు మరిగించాలి.

కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడూ బాగా చేతులతో కలిపి రసం తీసుకుని వడకట్టాలి. అంతే షాంపూ తయారయింది. ఈ షాంపూ తో తలస్నానం చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. కుంకుడుకాయ అనేది జుట్టు బాగా పొడవుగా, నల్లగా ,ఒత్తుగా పెరిగేలా చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

ఉసిరి పొడి జుట్టుకి సంబందించి అన్నీ రకాల సమస్యలను తగ్గించి జుట్టు రాలకుండా కాపాడుతుంది. కరివేపాకు జుట్టు రాలకుండా చేయటమే కాకుండా తెల్లజుట్టు నల్లగా అయ్యేలా చేస్తుంది. వారంలో రెండు సార్లు ఈ షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం చాలా తొందరగానే కనపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


