Beauty Tips

Dark Neck : మెడ నల్లగా మారిందా.. వీటిని రాస్తే మెరిసిపోతుంది

Dark Neck : మెడ నల్లగా మారిందా.. వీటిని రాస్తే మెరిసిపోతుంది.. మెడ భాగం మీద ఉన్న నలుపు తొలగించుకోవటం చాలా కష్టంగా ఉందా? ముఖం, body మొత్తం కూడా తెల్లగా ఉన్నా మెడ భాగం మాత్రం నల్లగా ఉంటుంది. స్కిన్ డాక్టర్ దగ్గరకు వెళ్లిన పెద్దగా ఉపయోగం ఉండదు. మనం ఇంటిలోనే చిన్న చిట్కా ద్వారా మెడ నలుపును సులభంగా తొలగించు కోవచ్చు. మెడ నలుపు రావటానికి కారణాలు ఏమిటో ఒకసారి చూద్దాం.

మనం ముఖం మీద పెట్టిన శ్రద్ద మెడ మీద పెట్టం. ముఖానికి రకరకాల ఫెస్ క్రీమ్స్, పేస్ వాష్ వంటివి ఎన్నో రకాలు వాడుతూ ఉంటాం. కానీ మెడ దగ్గరకు వచ్చేసరికి పెద్దగా శ్రద్ద వహించం. అంతేకాక మెడ భాగంలో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దాన్ని పట్టించుకోకపోతే ముడతలు పడుతుంది.
Face Beauty Tips In telugu
అలా ముడతలు పడటం వలన దుమ్ము అక్కడ పేరుకొని నల్లగా మారుతుంది. మరొక కారణం ఏమిటంటే వయస్సుకు మించి బరువుగా ఉండటం వలన కూడా మెడ మీద నలుపు పెరుగుతుంది. ఇప్పుడు చిట్కా కోసం ఏమి అవసరం అవుతాయో చూద్దాం. ఈ చిట్కా కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ అవసరం అవుతాయి.

కాఫీ
యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. రక్త ప్రసరణను పెంచుతుంది. మెడ మీద నలుపును తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది.

నిమ్మరసం
విటమిన్ సి,బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన మెడ మీద నలుపును తొలగించటంలో సహాయపడుతుంది.

రోజ్ వాటర్
రోజా వాటర్ లో ఉండే లక్షణాలు మెడ మీద నలుపును తొలగిస్తాయి.

ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూన్ కాఫీ పౌడర్,ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో నిమ్మ చెక్కను ముంచి నలుపు ఉన్న మెడ ప్రాంతంలో వృత్తాకార మోషన్ లో 2 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా మెడ మీద నలుపు తొలగిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."