MoviesTollywood news in telugu

Geetha govindam:5 కోట్లతో తీసిన గీతా గోవిందం కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలిస్తే..

Geetha govindam:5 కోట్లతో తీసిన గీతా గోవిందం కలెక్షన్స్ ఎన్ని కోట్లో తెలిస్తే… గీతా గోవిందం సినిమా విడుదల అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా సరే.. ఇప్పటికి చాలా ఆసక్తిగా చూడటానికి అభిమానులు సిద్దంగా ఉంటారు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీతా గోవిందం విడుదల అయినా మొదటి ఆట నుండే బాక్స్ ఆఫీస్ వద్ద కుమ్మేసింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత చేసిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తనలో ఫన్నీ కోణం కూడా ఉందని నిరూపించుకున్నాడు.
geetha govindham movie
పరుశరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందాన నటించింది. అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. చివరకి టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాలో హాస్యానికి ఫిదా అవుతున్నారంటే సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ ఫెర్ఫామెన్స్ కి మహేష్ బాబు,అల్లు అర్జున్,రామ్ చరణ్ లు సైతం విజయ్ ని మెచ్చుకున్నారు.
Tollywood hero vijay devarakonda
ఈ సినిమాకి నిర్మాతలు అయినా అల్లు అరవింద్,బన్నీ వాసు లాభాల బాట పట్టారు. ఆగష్టు 15న విడుదలైన గీత గోవిందం.. ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే రూ.33 కోట్ల గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలోనూ విజయ్ సినిమా రూ.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవరాల్‌గా ఇండియాలో ఈ చిత్రం రూ.40 కోట్లకు పైగా రాబట్టింది.