BusinessDevotional

IRCTC: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..ఫ్లైట్‌లో జర్నీ.. స్పెషల్ టూర్‌ ప్యాకేజీ

IRCTC: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..ఫ్లైట్‌లో జర్నీ.. స్పెషల్ టూర్‌ ప్యాకేజీ.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కానీ దర్శనం టికెట్స్‌ ముందుగా లభించకనో, రూమ్స్‌ అందుబాటులో లేకో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారికోసమే ఐఆర్‌సీటీసీ మంచి టూర్‌ ప్యాకేజీలను అందిస్తోంది.

ఇప్పుడు చెప్పే ప్యాకేజీలు హైదరాబాద్ నుంచి మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు విశాఖపట్నం నుంచి కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆగస్టు 9, 23వ తేదీల్లో ఈ టూర్‌ అందుబాటులో ఉంది.

మొదటి రోజు విశాఖపట్నం ఎయిర్‌ పోర్ట్ నుంచి ఉదయం 10.20 గంటలకు విమానం బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హోటల్‌లో తీసుకెళ్తారు.

అక్కడ ఫ్రెషప్‌ అయిన తర్వాత భోజనం ముగించుకొని కాణిపాకం, శ్రీనివాస మంగాపురం ఆలయాల సందర్శన ఉంటుంది. తిరిగి హోటల్‌కు చేరుకున్న తర్వాత భోజనం చేసి రాత్రి హోటల్‌లోనే బస ఉంటుంది.

రెండో రోజు ఉదయం టిఫిన్‌ చేయగానే తిరుమల వెంకటేశ్వర స్వామి శీఘ్రదర్శనం ఉంటుంది. దర్శనం పూర్తి కాగానే లంచ్‌ చేసిన తర్వాత శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాల దర్శనం ఉంటుంది. రాత్రి తిరుపతి హోటల్‌లోనే బస ఉంటుంది.

ఇక మూడో రోజు ఉదయం టిఫిన్‌ చేసిన తర్వాత హోటల్‌ నుంచి చెకవుట్ చేస్తారు. అనంతరం గోవింద రాజస్వామి దేవాలయం, ఇస్కాన్ ఆలయాలను సందర్శన ఉంటుంది. మధ్యలోనే భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు విశాఖకు తిరుపతి నుంచి విమానం బయలుదేరుతుంది. సాయంత్రం 6:35 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర వివరాలు..
ప్యాకేజీ ధర విషయానికొస్తే.. సింగిల్‌ ఆక్యూపెన్సీ ప్రారంభ ధర రూ. 23,565, డబుల్‌ ఆక్యూపెన్సీ రూ. 20,195, ట్రిపుల్ ఆక్యూపెన్సీ రూ. 20,000, చైల్డ్‌ విత్ బెడ్ రూ. 18,375, చైల్డ్ వితవుట్ బెడ్ ధర రూ. 17,880గా నిర్ణయించారు. ఇది 9వ తేదీన బుక్‌ చేసుకున్న వారికి. 23వ తేదీ ప్యాకేజీకి మరో రకమైన ఫేర్‌ ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."