Beauty Tips

Hair Tips: తలకు ఉల్లిపాయ రసం ఎలా రాస్తే.. జుట్టు పెరుగుతుందో తెలుసా?

Hair Tips: తలకు ఉల్లిపాయ రసం ఎలా రాస్తే.. జుట్టు పెరుగుతుందో తెలుసా.. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతీ ఒకరు జుట్టు రాలే సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అయితే దీనికి అనేక రకాల కారణాలున్నాయి. కొందరిలో చుండ్ర సమస్య వేధిస్తుంది. ఇది కూడా హెయిర్ ఫాల్‌కు కారణం అవుతుంది. మరికొందరు.. వెంట్రుకలకు అవసరమైన పోషణ లేకుండా వాటిని వదిలేస్తుంటారు. ఇది కూడా హెయిర్ ఫాల్‌కు కారణం. అయితే ఇలాంటి సమస్యలకు మనం ఇంట్లో కొన్ని చిట్కాలతో చెక్ పెట్టొచ్చు.

చాలా తక్కువ ఖర్చులో జుట్టు రాలకుండా చేసుకోవచ్చు. ఈ చిట్కా కోసం సబ్జా గింజలను ఉపయోగిస్తున్నాం. సబ్జా గింజలు వేసవిలో అలసట,నీరసం తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. సబ్జా గింజలు జుట్టు సంరక్షణలో సహాయపడుతుందని మనలో చాలా మందికి తెలియదు.

ఒక స్పూన్ సబ్జా గింజలను నీటిలో రెండు గంటల పాటు నానబెట్టాలి. కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి నీటిని పోసి మిక్సీ చేసి పాలను తయారుచేయాలి. మిక్సీ జార్ లో నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలు, ఒక చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి.

ఆ తరువాత కొబ్బరి పాలను పోసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించి అరగంట అలా వదిలేయలి.

అరగంట అయ్యాక రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటమే కాకుండా చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ