Beauty Tips

Fenugreek seeds for Face:ముఖాన్ని అందంగా మార్చే మెంతులు.. ఇలా వాడితే పట్టులాంటి చర్మం మీ సొంతం..!

Fenugreek seeds for Face:ముఖాన్ని అందంగా మార్చే మెంతులు.. ఇలా వాడితే పట్టులాంటి చర్మం మీ సొంతం.. మెంతులు చర్మాన్ని శుభ్రపరచడంలో ఎంతగానో సహాయపడతాయి. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంలోని మురికి, జిడ్డు తొలగిపోయి ఫ్రెష్ లుక్ వస్తుంది.

అలాగే, మెంతులు ముఖంలోని బ్లాక్ హెడ్స్, మొటిమలను తొలగించి, క్లియర్ స్కిన్ టోన్ ఇస్తుంది. దీంతో కోల్పోయిన యవ్వనాన్ని కూడా పునరుద్ధరించడంలో మెంతులతో తయారు చేసిన ప్యాక్‌ అద్భుతంగా సహాయపడుతుంది.

మన వంటింటిలో పోపుల డబ్బాలో ఉండే మెంతులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మెంతులతో చిన్న చిన్న చిట్కాలు చేస్తే అందాన్ని కూడా పెంచుకోవచ్చు. మొటిమలు,మొటిమల మచ్చలు తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

దీని కోసం ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ మెంతులను నానబెట్టి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో చిటికెడు పసుపు,అరస్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి 2 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే మొటిమలు, మచ్చలు, రంధ్రాల సమస్యలు అన్ని తొలగిపోతాయి.ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మొటిమలకు బెస్ట్ చిట్కా అని చెప్పవచ్చు.

మెంతులు చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. అలాగే పసుపు,తేనె కూడా మొటిమలు,నల్లని మచ్చలను తొలగించటంలో చాలా బాగా సహాయపడుతుంది.

మెంతులలో విటమిన్లు, పొటాషియం, ఇతర పోషకాలు సమృద్దిగా ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అదేవిధంగా చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి మెంతులు ఎంతగానో సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ