Beauty Tips

White Hair Turn Black: హెయిర్ డై అవసరం లేదు.. తెల్లజుట్టు ఎప్పటికి నల్లగా మారాలంటే..

White Hair Turn Black: హెయిర్ డై అవసరం లేదు.. తెల్లజుట్టు ఎప్పటికి నల్లగా మారాలంటే.. మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా ఈ రోజుల్లో జుట్టు సమస్య సర్వసాధారణం. చిన్న వయసులోనే జుట్టు నెరసిపోవడం ఈ రోజుల్లో మరింత సాధారణ సమస్యగా మారిపోయింది.

ప్రస్తుతం 20 నుంచి 25 ఏళ్ల యువతులు కూడా తెల్లజుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంలో తెల్ల జుట్టును దాచడానికి హెయిర్ డై లేదా రసాయన రంగును ఉపయోగిస్తున్నారు. ఇది తాత్కాలికంగా జుట్టును నల్లగా మార్చవచ్చు.

కానీ ఫలితంగా ష్ప్రభావాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ గా జుట్టును నల్లగా మార్చుకోవడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కొబ్బరినూనె, సోంపు గింజల మిశ్రమం తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది.

సోంపు గింజలను మెత్తని పొడిగా చేసుకోవాలి.పాన్ లో 100 గ్రాముల కొబ్బరి నూనెను పొయ్యి మీద పెట్టి ఒక స్పూన్ సోంపు పొడి వేసి సోంపు రంగు మారే వరకు మరిగించాలి.

ఈ నూనెను వడకట్టి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేయాల్. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

సోంపు నూనెలో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు సమృద్దిగా ఉండుట వలన తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా చుండ్రు,జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ