Beauty Tips

white hair Turn Black:క్షణాల్లో తెల్లజుట్టును నల్లగా మార్చే ఆకు

white hair Turn Black:క్షణాల్లో తెల్లజుట్టును నల్లగా మార్చే ఆకు.. తెల్లజుట్టు ఎక్కడైనా కనబడగానే చాలామంది గాభరా పడిపోతారు. ఒకే ఒక్కటి ఉంటే దాన్ని లాగేయడం చేస్తారు. ఒకటి కంటే ఎక్కువ తెల్ల వెంట్రుకలు ఉంటే వాటిని కవర్ చేయడానికి నానా తంటాలు పడతారు.

అయితే తెల్లజుట్టును కవర్ చేయడానికి వాడే చాలా వాణిజ్య ఉత్పత్తులలో రసాయనాలుంటాయి. ఇవి జుట్టుకు రంగును తాత్కాలికంగా ఇస్తాయి కానీ మెదడులోపలి నరాలను చాలా దెబ్బతీస్తాయి. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టును నల్లగా మార్చే ఆకు ఉంది.

గుంటగలగర ఆకులో ఉన్న గుణాలు జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాస్త ఓపిక,శ్రద్ద పెడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకి సంబందించిన సమస్యలను చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. గుంటగలగర ఆకు పల్లెటూర్లలో ఉండేవారికి బాగా తెలుసు. ఈ ఆకును శుభ్రం కడిగి మిక్సీలో వేసి రసం తీయాలి.

ఈ ఆకు రసం ఒక కప్పు తీసుకుంటే మరొక కప్పు కొబ్బరి నూనె తీసుకొని రెండింటినీ కలిపి ఒక గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి రసం అంతా ఇగిరిపోయి నూనె మిగిలే వరకు మరిగించాలి. ఇలా మరిగిన నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజు జుట్టు కుదుళ్లకు పట్టిస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య అనేవి కేవలం వారం రోజుల్లోనే తగ్గుతాయి.

గుంటగలగర ఆకు దొరకని వారు గుంటగలగర ఆకు పొడి మార్కెట్ లో లేదా Online Stores లో లభ్యం అవుతుంది. ఆ పొడితో నూనెను తయారుచేసుకోవచ్చు. ఈ నూనె జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఈ నూనెను ఒకసారి తయారుచేసుకుంటే నెల రోజుల వరకు వాడవచ్చు. గుంటగలగర ఆకులో ఉండే లక్షణాలు తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ నూనెను వాడి జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."