Beauty Tips

Remedies for White Hair: తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు.. మీ కోసమే..

Remedies for White Hair: తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు.. మీ కోసమే.. ప్రస్తుత కాలంలో చాలా మంది తెల్ల జుట్టుతో బాధ పడుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడంతో బయట నలుగురిలో తిరగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. ముఖ్యంగా యువతలో తెల్ల జుట్టు ఎక్కువగా కనిపిస్తుంది.

అకాలంగా తెల్ల జుట్టు వచ్చిందంటే అనారోగ్యానికి సంకేతంగా చెప్పొచ్చు. సరైన పోషణ లేని కారణంగా జుట్టు రంగు అనేది మారుతుంది. ఈ తెల్ల జుట్టును తగ్గించుకోవడానికి చాలా మంది మార్కెట్లో లభించే అనేక ప్రాడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటితో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అలా కాకుండా ఇంట్లోనే కొన్ని నేచురల్ పద్దతుల ద్వారా కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితి, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో తెల్లజుట్టు సమస్యతో… మనలో చాలా మంది చాలా చిన్న వయస్సులోనే ఇబ్బంది పడుతున్నారు. ఇలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావటం వలన బయటకు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.

దాంతో మార్కెట్ లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

అరకప్పు పెరుగులో ఒక స్పూన్ మిరియాల పొడి,ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటె తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

ఒక కప్పు బ్లాక్ టీ లేదా కాఫీలో తగినంత హెన్నా పౌడర్ కలపండి. ఆరు గంటల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. మూడు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."