Movies

Tollywood: ‘రానా’ కు ఆ పేరు ఎలా పెట్టారో తెలుసా..?!

Tollywood:రానా దగ్గుబాటి… బాహుబలి సినిమాతో తన పేరును దశదిశలా వ్యాపింపజేసాడు. అయితే ‘రానా’ కు రానా అనే పేరు ఎలా పెట్టారో తెలుసా.. దానికి ఒక హిస్టరీ ఉందట. మొదట రానాకు సిద్దార్థ్ అనే పేరును పెట్టాలని అనుకున్నారట రానా తల్లి.

అయితే బారసాల రోజున కొడుకు పేరు రాయాలని పంతులుగారు చెప్పినప్పుడు సురేశ్ బాబు తన తండ్రి పేరైన ‘రామానాయుడు’ పేరును రాసేసాడట. తాను ఎవరికీచెప్పలేదనీ. నాన్న పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యా కాబట్టే పెట్టేసానని సురేష్ బాబు ఒక సందర్భంలో తెలిపారు. ఇది చూసి రామానాయుడు గారు బాగా ఆనందపడ్డారట. అయితే…

నాన్న ఫ్రెండ్ ఒకాయన‘రామానాయుడు’ అని తాను పిలవలేనని.. రామా నాయుడు పదాల్లోని మొదటి అక్షరాలు కలిపి రానా అని పిలుస్తానని చెప్పాడట. అలా ‘రానా’ పేరు స్థిరపడిపోయిందట. ఇదన్న మాట ‘రానా’ కు ‘రానా’ అన్న పేరు ఎందుకు పెట్టారో అన్న ప్రశ్నకు సమాధానం.

మొత్తానికి బలే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ.. రానా కూడా తాత గారికి తగిన విధంగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. దగ్గుబాటి రామానాయుడుకి ఈ యువ హీరో పట్ల చాలా మంచి అభిప్రాయమే ఉండేదట. ఏమయినా తాత పేరు పెట్టుకున్నందుకు ఆయన పేరును నిలబెట్టేలా సినీ రంగంలో ఎదుగుతున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."