Beauty Tips

Glowing skin : ఫ్రూట్స్‌ని ఇలా వాడితే మీ స్కిన్ మెరిసిపోద్ది..

Glowing skin : ఫ్రూట్స్‌ని ఇలా వాడితే మీ స్కిన్ మెరిసిపోద్ది.. వేసవిలో ముఖ చర్మానికి పోషణ అవసరం. సీజనల్ పండ్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లు చర్మాన్ని మెరిసేలా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఫేస్ ప్యాక్‌లను రెగ్యులర్‌గా ఉపయోగిస్తే చర్మం ప్రకాశవంతంగా, అందంగా కనిపిస్తుంది. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ ఫేస్ ప్యాక్‌ల గురించి తెలుసుకుందాం.

1. మామిడి ఫేస్ ప్యాక్
మామిడి గుజ్జు (2-3 టీస్పూన్లు) తీసుకుని, అందులో కొద్దిగా కోల్డ్ క్రీమ్ లేదా తాజా క్రీమ్, చల్లని పాలు కలపండి. ఈ మిశ్రమాన్ని పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడగండి. ఇది చర్మాన్ని తాజాగా, మృదువుగా చేస్తుంది.

2. పుచ్చకాయ ఫేస్ ప్యాక్
పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మ రంధ్రాలకు హైడ్రేషన్ అందించడానికి పుచ్చకాయ గుజ్జులో కొద్దిగా పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయండి. ఇది చర్మాన్ని తేమతో నింపుతుంది.

3. కివీ ఫేస్ ప్యాక్
కివీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ సౌందర్యానికి కూడా గొప్పగా పనిచేస్తుంది. కివీ జ్యూస్‌లో 1 టీస్పూన్ తేనె కలపండి. అవసరమైతే కొద్దిగా బాదం పేస్ట్ కూడా జోడించవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడగండి. ఇది చర్మానికి గ్లోని అందిస్తుంది.

4. దోసకాయ ఫేస్ ప్యాక్
దోసకాయలో 90% నీరు ఉండటం వల్ల ఇది చర్మానికి అద్భుతమైన హైడ్రేషన్ అందిస్తుంది. సగం దోసకాయను రుబ్బి, అందులో కొద్దిగా చక్కెర, పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగండి. ఇది చర్మాన్ని తాజాగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

5. టమాటో ఫేస్ ప్యాక్
టమాటోలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది చర్మంపై నల్లటి మచ్చలను తొలగిస్తుంది. టమాటోను రుబ్బి రసం తీసి, టాన్ ఉన్న చోట నేరుగా అప్లై చేయండి. లేదా టమాటోను సన్నగా కోసి ముఖంపై రుద్దండి. ఇలా చేయడం వల్ల చర్మం మచ్చలు తగ్గి, ప్రకాశవంతంగా మారుతుంది.

ఈ ఫేస్ ప్యాక్‌లను వారానికి 2-3 సార్లు ఉపయోగించడం వల్ల వేసవిలో మీ చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్యాక్ లను వేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందమైన ముఖాన్ని సొంతం చేసుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ