Korean Skincare : కొరియన్స్లా గ్లాసీ స్కిన్ రావాలంటే ఇలా చేయండి… చాలా సింపుల్..
Korean Skincare : కొరియన్స్లా గ్లాసీ స్కిన్ రావాలంటే ఇలా చేయండి… చాలా సింపుల్.. ప్రస్తుత కాలంలో అందంపై ప్రతి ఒక్కరి దృష్టి ఎక్కువైంది. గతంలో అందంపై పెద్దగా ఆసక్తి లేనప్పటికీ, కొంతమేరకు శ్రద్ధ ఉండేది. కానీ, మారుతున్న జీవనశైలి మరియు టెక్నాలజీ ప్రభావంతో అందరిలోనూ అందంపై ఆసక్తి గణనీయంగా పెరిగింది.
వయసుతో సంబంధం లేకుండా అందంగా కనిపించాలనే కోరిక బలంగా ఉంది. ఈ కోరిక కోసం మార్కెట్లో లభించే వివిధ రకాల క్రీములను ఉపయోగిస్తున్నారు, బ్యూటీ పార్లర్లకు వెళ్లి రకరకాల ఫేసియల్స్ చేయించుకుంటున్నారు. అయితే, ఇవి తాత్కాలిక ఫలితాలు ఇస్తాయి తప్ప, శాశ్వత పరిష్కారం కాదు. ఇంకా, ఇవి చర్మానికి హాని కలిగించే అవకాశం కూడా ఉంది.
ఈ మధ్య సోషల్ మీడియాలో కొరియన్ స్కిన్ కేర్ గురించి చాలా చర్చ జరుగుతోంది. కొరియన్ చర్మం మృదువుగా, గ్లాసీ లుక్తో మెరుస్తూ ఉంటుంది. చాలా మంది అమ్మాయిలు అలాంటి చర్మం కావాలని కోరుకుంటున్నారు. మీ చర్మం కూడా కొరియన్ స్కిన్లా మెరిసేలా ఉండాలంటే, ఈ సహజమైన చిట్కాలను పాటించండి. ఇవి తక్షణ ఫలితాలను ఇస్తాయి. ఆలస్యం ఎందుకు? ఈ చిట్కాలను ఎలా సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫేస్ క్లీనర్ కోసం – పాలు, పసుపు మాస్క్
ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పాలు, చిటికెడు పసుపు కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల ముఖంపై మురికి, మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా, శుభ్రంగా కనిపిస్తుంది.
ఫేస్ స్క్రబ్ కోసం – పంచదార, తేనె
ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పంచదార, తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయండి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
ఫేస్ టోనర్ కోసం – అలోవెరా జెల్, రోజ్ వాటర్
ఒక చిన్న గిన్నెలో అలోవెరా జెల్, రోజ్ వాటర్ కలిపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అరగంట తర్వాత గోబెచ్చని నీటితో కడిగేయండి. ఇది చర్మాన్ని శుభ్రం చేయడమే కాక, చర్మంలోని రంధ్రాలను బిగుతుగా చేస్తుంది.
ఫేస్ మాస్క్ కోసం – అరటిపండు, తేనె
బాగా పండిన అరటిపండును తీసుకుని మెత్తగా మాష్ చేయండి. అందులో 2 టేబుల్ స్పూన్ల తేనె కలిపి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఈ మాస్క్ చర్మాన్ని హైడ్రేట్ చేసి, మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అంతేకాదు, మృతకణాలను తొలగించి, మొటిమలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది.
ఈ చిట్కాలను ప్రతి రెండు వారాలకు ఒకసారి క్రమం తప్పకుండా పాటిస్తే, కొరియన్ స్కిన్లా అందమైన, మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఈ సహజ పదార్థాల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

