Skin Glow Tips:పచ్చి పాలలో ఇంట్లో దొరికే వీటిని కలిపి వాడితే.. మెరిసే చర్మం మీ సొంతం..
Skin Glow Tips:పచ్చి పాలలో ఇంట్లో దొరికే వీటిని కలిపి వాడితే.. మెరిసే చర్మం మీ సొంతం.. మీకు అందమైన, మెరిసే ముఖం కావాలనుకుంటున్నారా? మీ చర్మం ఎప్పుడూ పట్టులా మృదువుగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే, పాలతో ఈ సులభమైన పద్ధతులను ప్రతిరోజూ అనుసరించండి. మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా మారుతుంది.
పాలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో, చర్మ సౌందర్యానికి కూడా అంతే ఉపయోగకరం. పాలలో విటమిన్ ఎ, విటమిన్ డి, బి6, బీ12, కాల్షియం, లాక్టిక్ యాసిడ్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. పాలను వివిధ రకాలుగా చర్మ సంరక్షణకు ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ ముఖానికి పాలను ఉపయోగించడం వల్ల మురికి, మృతకణాలు తొలగిపోయి, చర్మం ప్రకాశవంతంగా మారుతుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి పాలతో తయారుచేసే ఫేస్ ప్యాక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. పచ్చిపాలు, కోడిగుడ్డు ఫేస్ ప్యాక్
ఒక చిన్న గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల పచ్చిపాలు, ఒక కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకుని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 10 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. వారానికి 3 సార్లు ఇలా చేస్తే, ముఖంపైని మురికి, అదనపు నూనె తొలగిపోయి, చర్మం అందంగా, తాజాగా కనిపిస్తుంది.
2. పాలు, ఓట్స్ ఫేస్ ప్యాక్
ఒక కప్పు పచ్చిపాలలో 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ కలపండి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడిగేయండి. వారానికి 2 సార్లు ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
3. పచ్చిపాలు, అరటిపండు ఫేస్ ప్యాక్
ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పచ్చిపాలు, మెత్తగా గుజ్జు చేసిన అరటిపండు కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. వారానికి 2 సార్లు ఈ పద్ధతిని అనుసరిస్తే, ముఖంపైని మచ్చలు, మొటిమలు తొలగిపోయి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
4. పాలు, తేనె ఫేస్ ప్యాక్
ఒక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పచ్చిపాలు, 2 టేబుల్ స్పూన్ల తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి, సాధారణ నీటితో కడిగేయండి. రోజూ ఇలా చేస్తే, ముఖంపైని దుమ్ము, ధూళి తొలగిపోయి, చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

